Egg Tadka Masala: వెరైటీగా తినాలి అనుకుంటున్నారా.. ఈ రెసిపీ బెస్ట్!

|

Jul 03, 2024 | 8:35 PM

గుడ్డుతో చేసే ఎలాంటి వంటకాలైనా చాలా రుచిగా ఉంటాయి. కోడి గుడ్డుతో స్నాక్స్, కర్రీస్, వేపుళ్లు ఇలా ఒక్కటేంటి.. చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. గుడ్డు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. గుడ్డుతో చేసే మరో కొత్త రెసిపీని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. అదే ఎగ్ తడ్కా మసాలా. ఈ రెసిపీ చాలా తక్కువ మందికే తెలుసు. గుడ్డుతో పాటు పెసరపప్పు, శనగ పప్పు వేసి తయారు చేస్తారు. ఇది ఎంతో రుచిగా..

Egg Tadka Masala: వెరైటీగా తినాలి అనుకుంటున్నారా.. ఈ రెసిపీ బెస్ట్!
Egg Tadka Masala
Follow us on

గుడ్డుతో చేసే ఎలాంటి వంటకాలైనా చాలా రుచిగా ఉంటాయి. కోడి గుడ్డుతో స్నాక్స్, కర్రీస్, వేపుళ్లు ఇలా ఒక్కటేంటి.. చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. గుడ్డు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. గుడ్డుతో చేసే మరో కొత్త రెసిపీని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. అదే ఎగ్ తడ్కా మసాలా. ఈ రెసిపీ చాలా తక్కువ మందికే తెలుసు. గుడ్డుతో పాటు పెసరపప్పు, శనగ పప్పు వేసి తయారు చేస్తారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. రోటీ, చపాతీలు, వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ ఎగ్ తడ్కా మసాలా వంటకం ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ తడ్కా మసాలాకి కావాల్సిన పదార్థాలు:

కోడి గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటా, పెసర పప్పు, శనగ పప్పు, గరం మసాలా, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తి మీర, పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ ఆకులు, బటర్, నూనె.

ఎగ్ తడ్కా మసాలా తయారీ విధానం:

ఈ వంట మొదలు పెట్టే ముందు.. ముందుగా మూడు గంటల ముందు పెసర పప్పు, శనగ పప్పు నానబెట్టు కోవాలి. ఆ తర్వాత వీటిని కుక్కర్‌లో రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి. ఇప్పుడు వేడి తగ్గేంత వరకూ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో గుడ్లను కొట్టి.. ఉప్పు, కొద్దిగా కారం వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి.. ఆమ్లెట్ వేసుకుని.. రెండు వైపులా కాలాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో బటర్, కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేగాక.. అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి బాగా వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా వేగాక టమాటా తరుగు, ఉప్పు, పసుపు వేసి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించాలి. ఆ నెక్ట్స్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి ఓ ఐదు నిమిషాలు బాగా వేయించాలి. ఇప్పుడు ఉడక బెట్టిన పప్పులను వేసి కలపాలి. వీటిని ఓ రెండు నిమిషాలు వేయించాక.. ఆమ్లెట్‌ని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇందులో కసూరి మేతి పొడిలా చేసి వేయాలి. ఇదంతా చిన్న మంట మీద ఓ 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఎగ్ తడ్కా మసాలా సిద్ధం.