క్రిస్మస్‌ని ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద పండుగగా నిర్వహిస్తారు. గ్రామాల్లో కూడా క్రిస్మస్‌ని ఎంతో ఘనంగా చేసుకుంటారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పండుగ సమయంలో సమయం చాలా తక్కువగా ఉంటుంది. వచ్చే గెస్టులకు ఈజీగా అయిపోయే స్నాక్స్ చేయాలి అనుకుంటే.. ఈ రెసిపీ బెస్ట్ అని చెప్పొచ్చు. అదే చిల్లీ చీజీ టోస్ట్. ఇది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. బర్త్ డే పార్టీలకు, ఇంట్లో చిన్న ఫంక్షన్స్‌కు ఈ రెసిపీ చేయవచ్చు. చాలా ఈజీగా ఈ స్నాక్ ప్రిపేర్ చేయవచ్చు. మరి ఈ చిల్లీ చీజీ టోస్ట్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
శాండ్విచ్ బ్రెడ్, బటర్, ఆకు కూరలు, కొత్తిమీర, వెల్లుల్లి, చీజ్ క్యూబ్స్, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో.
చిల్లీ చీజీ టోస్ట్ తయారు చేయడానికి ముందుగా వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో వెల్లుల్లి ముక్కలు, చీజ్, వెన్న, ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత శాండ్విచ్ బ్రెడ్ తీసుకుని.. శాండ్విచ్ ఆకారంలో కట్ చేసి.. మధ్యలో చీజ్ క్యూబ్స్‌ని అప్లై చేయండి. దాని పైన ముందుగా మిక్స్ చేసిన ఒరేగానో మిశ్రమాన్ని రాయండి. రెండు వైపులా ఇలా అప్లై చేయండి.
నెక్ట్స్ ఒకదాని మీద ఉంచాలి. ఆ తర్వాత దోశ పాన్ స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. దానిపై ఒరేగానో మిశ్రమాన్ని రాయండి. దానిపై బ్రెడ్‌ని ఉంచి వేడి చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చిల్లీ చీజ్ టోస్ట్ సిద్ధం. ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటాయి. తక్కువ సయమంలోనే పూర్తి అవుతుంది. ఈ టోస్ట్‌ని టమాటా కెచప్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.