రెస్టారెంట్స్, హోటల్స్‌కి వెళ్లినప్పుడు చాలా మంది ఏదన్నా నాన్ వెజ్ కర్రీ ఆర్డర్ ఇచ్చి.. నాన్స్ కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఇవి అలా నోట్లో పెట్టుకుని తింటూ ఉంటే ఆహా అనిపిస్తుంది. చాలా మంది నాన్స్ తినేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాన్స్‌లో ఎన్నో రకాలు ఉన్నా.. ఎక్కువగా బటర్ నాన్స్ తినేందుకే ఇష్ట పడుతున్నారు. ఈ నాన్స్ చాలా మెత్తగా ఉంటాయి. అయితే ఖరీదు ఎక్కువ. కాబట్టి కాస్త శ్రమ పడినా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ బటర్ నాన్స్ ఎక్కువగా మైదాతో చేస్తారు. కానీ మైదా ఆరోగ్యానికి మంచిది కాదు.. కాబట్టి గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు. రుచిలో కూడా పెద్దగా ఎలాంటి మార్పు ఉండదు. మరి ఇంట్లోనే ఈ బటర్ నాన్స్ ఎలా తయారు చేస్తారు? ఈ నాన్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.
గోధుమ పిండి, బటర్, పెరుగు, బేకింగ్ సోడా, ఉప్పు, పంచదార.
ముందుగా గోధుమ పిండి తీసుకుని.. మెత్తగా ఉండేలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పండిని గిన్నెలోకి తీసుకోవాలి అందులో బటర్, పెరుగు, బేకింగ్ సోడా, ఉప్పు, పంచదార, కొద్దిగా నీళ్లు వేసి చపాతీ పిండి లేదా పూరీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిపై తడి గుడ్డ వేసి ఓ పావు గంట సేపు పక్కన పెట్టండి. ఇప్పుడు కొద్దిగా పిండి చల్లి.. చేతితోనే ఈ బటర్ నాన్స్ ఒత్తుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి పాన్ మీద కొద్దిగా బటర్ వేసి చేసి పెట్టిన బటర్ నాన్స్ వేసి రెండు వైపులా మీడియం మంట మీద కాల్చుకోవాలి. చివరగా మళ్లీ ఇంకోసారి బటర్ పూయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బటర్ నాన్స్ సిద్ధం. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇంట్లోనే తయారు చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ బటర్ నాన్స్‌ని వెజ్ లేదా నాన్ వెజ్ కర్రీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి.