Bengali Chicken Curry: బెంగాలీ స్టైల్‌ స్పైసీ చికెన్ కర్రీ.. చపాతీలతో తింటే వేరే లెవల్!

| Edited By: Ram Naramaneni

Nov 17, 2024 | 9:29 PM

చికెన్ అంటే నాన్ వెజ్ ప్రియులకు బాగా ఇష్టం. చికెన్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో మంచి ప్రోటీన్ లభిస్తుంది. వారంలో నాలుగు సార్లు పిల్లలకు ఇవ్వడం చాలా మంచిది. చికెన్‌లో ఎన్నో వేల రెసిపీలు ఉన్నాయి. వాటిల్లో బెంగాలీ స్టైల్‌లో చేసే చికెన్ కర్రీని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

Bengali Chicken Curry: బెంగాలీ స్టైల్‌ స్పైసీ చికెన్ కర్రీ.. చపాతీలతో తింటే వేరే లెవల్!
Bengali Chicken Curry
Follow us on

చికెన్ అంటే ఇష్టం లేని నాన్ వెజ్ ప్రియులు ఉండరు. నాన్ వెజ్ వంటల్లో ముందుగా వచ్చేది చికెనే. దీంతో ఎలాంటి రెసిపీ చేసినా టేస్ట్ అదుర్స్. కొన్ని వేల రెసిపీలు చికెన్‌ మీద ఉన్నాయి. చికెన్ టేస్ట్ అలాంటిది మరి. కాస్త మసాలా పెట్టి నాటు కోడి వండితే ఆహా ఆ రుచే వేరు. నాటు కోడి నాటుకోడే.. ఈ ముచ్చట పక్కన పెడితే.. ఇప్పటికే ఆంధ్రా, తెలాంగాణ స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా తయారు చేస్తారో తెలుసు. అయితే బెంగాలీ స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా తయారు చేస్తారో తెలీదు. మన స్టైల్‌లో చికెన్ కర్రీ ఎప్పుడూ తింటాం. కానీ ఒక్కసారి బెంగాలీ స్టైల్‌లో ఈ చికెన్ కర్రీ ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. మరి బెంగెలీ స్టైల్ స్పైసీ చికెన్ కర్రీ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బెంగాలీ స్టైల్ స్పైసీ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు:

చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, నూనె, పెరుగు, జీడిపప్పులు, గసగసాలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, గరం మసాలా, యాలకులు, ఎండు మిర్చి, కుంకుమ పువ్వు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు.

బెంగాలీ స్టైల్ స్పైసీ చికెన్ కర్రీ తయారీ విధానం:

ముందుగా ఈ కర్రీ తయారు చేయడానికి ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసి మొత్తం కలిపి ఓ గంట పాటు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గోరు వెచ్చటి నీటిలో జీడిపప్పు, గసగసాలు వేసి పది నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు పచ్చి మిర్చి పేస్ట్ కూడా తయారు చేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. అలాగే కుంకుమ పువ్వు కూడా నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఎండు మిర్చి వేసి వేయించాక.. చికెన్ మిశ్రమం వేసి ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఇందులో జీడిపప్పు పేస్ట్, ఉప్పు, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. వీటిని ఓ పది నిమిషాలు ఉడికాక ఉల్లిపాయ పేస్ట్, నీళ్లు, ఉప్పు వేసి అన్నీ బాగా కలపాలి. ఇప్పుడు మంట తగ్గించి అరగంట సేపు చిన్న మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసి గ్రేవీలా అయ్యేదాకా ఉడికించాలి. చివరగా కుంకుపువ్వు వేసి చికెన్ బాగా ఉడికాక కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే బెంగాలీ స్టైల్ స్పైసీ మసాలా కర్రీ సిద్ధం. ఈ కర్రీ పూరీ, రోటి, చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.