Sweet Rice: దేవుడికి ప్రసాదంగా, పిల్లలకు నచ్చేలా స్వీట్ రైస్..

| Edited By: Ram Naramaneni

Nov 17, 2024 | 9:25 PM

రైస్‌లో చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. ఒక్కోటి ఒక్కో ఫ్లేవర్‌లో ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఈ రెసిపీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వంటకాన్ని పిల్లలు ఇష్టపడి మరీ తింటారు..

Sweet Rice: దేవుడికి ప్రసాదంగా, పిల్లలకు నచ్చేలా స్వీట్ రైస్..
Sweet Rice 1
Follow us on

స్వీట్ రైస్ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. దీన్ని దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టవచ్చు. అలాగే చిన్న పిల్లలకు నచ్చేలా కూడా చేయవచ్చు. తియ్యగా ఉంటుంది కాబట్టి పిల్లలు చక్కగా తినేస్తారు. ఈ రైస్ ఐటెమ్‌ని చాలా సింపుల్‌గా త్వరగా కూడా చేసేవయచ్చు. ఈ వంటకాన్ని కేరళ వాళ్లు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్లలకు ఏదైనా చేయాలి, త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయవచ్చు. మరి ఈ స్వీట్ రైస్ ఎలా తయారు చేస్తారు? ఈ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

బియ్యం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, బెల్లం పొడి లేదా పంచదార, కొబ్బరి పాలు, కొబ్బరి తురుము.

ఇవి కూడా చదవండి

స్వీట్ రైస్‌ తయారీ విధానం:

ముందుగా స్వీట్ రైస్ చేసేందుకు కొద్దిగా బియ్యాన్ని కడిగాలి. ఇప్పుడు ఇవి ఉడికేందుకు సరిపడా కొబ్బరి పాలు వేయండి. ఈ అన్నాన్ని ఇప్పుడు చిన్న మంట మీద ఉడికించాలి. అన్నం ఉడుకుతున్నప్పుడే పంచదార లేదంటే బెల్లం పొడి, పటిక బెల్లం పొడి అయినా వేయవచ్చు. ఉంటే కుంకు పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నం ఉడుకుతున్నప్పుడే కొబ్బరి తురుము కూడా వేసి కలపండి. అన్నం ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత నెయ్యితో పాటు అన్నంలో కలిపేయండి. అంతే ఎంతో రుచిగా ఉండే స్వీట్ రైస్ సిద్ధం. ఇది ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకు పెడితే చాలా మంచిది. ఇందులో ఉండేవి ఆరోగ్యకరమైనవే కాబట్టి పిల్లలు తింటే ఆరోగ్యంగా ఉంటారు.