Green Masala Fish Fry: గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై.. టేస్ట్ వేరే లెవల్ అంతే!

| Edited By: Ram Naramaneni

Nov 17, 2024 | 9:23 PM

సాధారణంగా చేసే చేపల వేపుడులో.. కారం, ఉప్పు, మసాలా వేసి చేస్తారు. కానీ గ్రీన్ ఫిష్ ఫ్రై ఒక్కసారి రుచి చూశారంటే అస్సలు వదిలి పెట్టరు. చాలా రుచిగా ఉంటుంది. ఇలా గ్రీన్ మసాలా ఫిష్ తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో మంచి పోషకాలు లభిస్తాయి..

Green Masala Fish Fry: గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై.. టేస్ట్ వేరే లెవల్ అంతే!
Green Masala Fish Fry
Follow us on

చేపలు అంటే ఎంతో మందికి ఇష్టంగా తింటూ ఉంటారు. చేపల పులుసు కంటే ఫ్రై తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. చేపల వేపుడు రుచిగా కూడా ఉంటుంది. చేపలు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు అన్నీ లభిస్తాయి. సాధారణంగా చేసే చేపల వేపుడులో.. కారం, ఉప్పు, మసాలా వేసి చేస్తారు. కానీ గ్రీన్ ఫిష్ ఫ్రై ఒక్కసారి రుచి చూశారంటే అస్సలు వదిలి పెట్టరు. చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో రసం వేసుకుని ఈ ఫ్రై నుంచుకుని తినేయవచ్చు. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. మరి ఈ గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

చేపలు, పుదీనా, కొత్తిమీర, పచ్చి మిర్చి, నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, ఆయిల్.

గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా గ్రీన్ మసాలాను సిద్దం చేసుకోవాలి. ఇందుకు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో.. పుదీనా, కొత్తిమీర, పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఇందులో నే కొద్దిగా జీలకర్ర, పసుపు కూడా కలుపుకోవాలి. కావాలంటే నీరు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం సైజులో ఉండే చేపలను తీసుకుని, శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. చేపల్లా అయినా కాల్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ గ్రీన్ మసాలా పేస్ట్ చేపలకు బాగా పట్టించండి. ఇప్పుడు ఒక గంట పాటు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెనం తీసుకుని.. దానిపై ఆయిల్ వేయాలి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. పాన్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ తక్కువగా పడుతుంది. పాన్ పై చేప ముక్కలు ఉంచి.. చిన్న మంట మీద రెండు వైపుగా వేయించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై సిద్దం.