Aloo Methi Masala: గెస్టులకు సింపుల్‌గా ఇలా ఆలూ మేథీ కర్రీ చేయండి.. అదిరిపోతుంది!

|

Feb 09, 2024 | 7:04 PM

బంగాళ దుంపలు, మెంతి కూరతో చేసే ఈ ఆలూ మేథీ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, పులావ్, చపాతీ, రోటీ ఇలా దేనితో తినేందుకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ చేయడం కూడా చాలా సులభం. ఇంటికి ఎవరైనా గెస్టులు సడెన్‌గా వచ్చినప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేయవచ్చు. ఒక్కసారి ఈ కర్రీ రుచి చూశారంటే.. మళ్లీ ఇదే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. వంటరాని వారు సైతం ఈజీగా చేసే వంటకం ఇది. మరి ఇంకెందుకు లేట్..

Aloo Methi Masala: గెస్టులకు సింపుల్‌గా ఇలా ఆలూ మేథీ కర్రీ చేయండి.. అదిరిపోతుంది!
Aloo Methi Masala
Follow us on

బంగాళ దుంపలు, మెంతి కూరతో చేసే ఈ ఆలూ మేథీ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, పులావ్, చపాతీ, రోటీ ఇలా దేనితో తినేందుకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ చేయడం కూడా చాలా సులభం. ఇంటికి ఎవరైనా గెస్టులు సడెన్‌గా వచ్చినప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేయవచ్చు. ఒక్కసారి ఈ కర్రీ రుచి చూశారంటే.. మళ్లీ ఇదే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. వంటరాని వారు సైతం ఈజీగా చేసే వంటకం ఇది. మరి ఇంకెందుకు లేట్.. ఆలూ మేథీ కర్రీ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆలూ మేథీ కర్రీకి కావాల్సిన పదార్థాలు:

ఆలు గడ్డ, మేంతి కూర, పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, టమాటాలు, ధనియాల పొడి, గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్, ఆయిల్.

ఆలూ మేథీ కర్రీ తయారీ విధానం:

ముందుగా పాన్ కర్రీ తీసుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నెక్ట్స్ బిర్యానీ దినుసులు కూడా వేసి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలను మిక్సీ పట్టి ప్యూరీలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేసుకుని ఓ ఐదు నిమిషాల పాటు వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు బంగాళ దుంప ముక్కలు వేసి.. మెత్తగా అయ్యేంత వరకూ కలపాలి. నెక్ట్స్ ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత మెంతి కూర కూడా వేసి మూత పెట్టి ఓ ఐదు నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసి కర్రీని బాగా ఉడికించాలి. కర్రీ దగ్గర పడ్డాక.. కొత్తి మీర వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో సింపుల్‌గా ఉండే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది.