Vastu Tips: వంటింట్లో వస్తువుల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..?

భారతీయులను, వాస్తును విడదీసి చూడలేని పరిస్థితి ఉంటుంది. వాస్తు శాస్త్రం ఆధారంగా ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తుంటారు. అందుకే ఇంటి పునాది మొదలు ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. ఇంట్లో కచ్చితంగా వాస్తు నియమాలు పాటించే వాటిలో వంటగది ఒకటి...

Vastu Tips: వంటింట్లో వస్తువుల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..?
Vastu Tips For Kitchen
Follow us

|

Updated on: Jun 16, 2024 | 1:45 PM

భారతీయులను, వాస్తును విడదీసి చూడలేని పరిస్థితి ఉంటుంది. వాస్తు శాస్త్రం ఆధారంగా ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తుంటారు. అందుకే ఇంటి పునాది మొదలు ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. ఇంట్లో కచ్చితంగా వాస్తు నియమాలు పాటించే వాటిలో వంటగది ఒకటి. వంటగది విషయంలో కచ్చితంగా కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వాస్తు పరంగా వంటింట్లో ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* వంటగదిలో మైక్రోవేవ్‌, మిక్సీఉల, గ్రైండర్‌, టోస్టర్‌తో పాటు ఎలక్ట్రానిక్ స్టవ్ లాంటి ఎలక్ట్రిక్ పరికరాలను ఆగ్నేయ దిశలోనే ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

* ఇక వంటింట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో బియ్యం ఒకటి. బియ్యాన్ని కచ్చితంగా నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

* పిండి లేదా బియ్యాన్ని.. ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ప్లాస్టిక్‌కు బదులుగా వీటిని లోహపు పాత్రలో స్టోర్‌ చేసుకోవాలి.

* ఇక వంటింట్లో ఉపయోగించే పసుపు, బియ్యం, పిండి, పప్పు పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలి. ఇవి పూర్తిగా ఖాళీ కాకముందే తెచ్చి పెట్టుకోవాలని చెబుతున్నారు.

* వంటింట్లో బియ్యం పూర్తిగా లేకుండా ఉండే పరిస్థితి తెచ్చుకోకూడదు. వంటింట్లో బియ్యం ఉంటేనే ఆనందం, ఐశ్వర్యం లభిస్తాయి. అలాగే శుక్ర దోషాలు తొలగిపోతాయని చెబుతారు.

* పసుపు కూడా నిండుకోకుండా చూసుకోవాలి. వంటింట్లో కచ్చితంగా ఎల్లప్పుడూ పసుపు ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో పసుపు లేకపోతే.. ఆర్థిక అడ్డంకులు, చదువులో ఆటంకాలు, వివాహానికి ఆటంకం వంటివి ఏర్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.

* ఉప్పు కూడా వంటింట్లో అయి పోకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉప్పును ఎవరి దగ్గరి నుంచైనా ఉచితంగా తీసుకోకూడదు. డబ్బు చెల్లించి మాత్రమే ఉప్పును తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఉప్పును ఎల్లప్పుడూ గాజు పాత్రలో ఉంచాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..