23 June 2024

టిఫిన్‌గా ఈ పండ్లను తీసుకుంటే.. ఆరోగ్యం మీసొంతం. 

Narender.Vaitla

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో అరటి పండును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మెరుగైన జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడుతుంది. ఇందులోని పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

 బ్రేక్‌ఫాస్ట్‌గా పుచ్చకాయను కూడా తీసుకోవచ్చు. పుచ్చకాయ రోజంతటికీ కావాల్సి శక్తి లభిస్తుంది, మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది.

ఉదయం బొప్పాయిను ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ మల బద్ధకం సమస్యలను దూరం చేస్తుంది.

బెర్రీ పండ్లను కూడా ఉదయం టిఫిన్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్‌, ఫైబర్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఆరెంజ్‌ను టిఫిన్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. 

యాపిల్స్‌ను ఉదయం ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తాయి. ఇందులోని సహజసిద్ధమైన చక్కెరలు, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

పియర్‌ పండును కూడా ఉదయం టిఫిన్‌గా తీసుకోవచ్చు. ఇందులోని ఫైబర్‌, విటమిన్‌ సి, పొటాషియం కంటెంట్‌ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.