అందుకే ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవాలట..!

23 June 2024

TV9 Telugu

TV9 Telugu

చాలామందికి నిద్రపోయేటప్పుడు బోర్లా, వెల్లకిలా పడుకోవడం అలవాటు! కానీ ఈ రెండింటి కంటే ఎడమవైపుకి తిరిగి పడుకోవడమే మంచిదని చెబుతోంది ఆయుర్వేద శాస్త్రం

TV9 Telugu

ఇలా చేస్తే భవిష్యత్తులో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఓ అధ్యయనంలో రుజువైంది. ఏ వయసు వారికైనా ఈ నిద్రా భంగిమే మంచిదని, దీనివల్ల ఆరోగ్యపరంగా బహుళ ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

జీవక్రియలన్నీ సజావుగా జరగాలంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఎడమవైపుకి తిరిగి పడుకోవడం అవసరం. దీనివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది

TV9 Telugu

నిజానికి, మనం తిన్న ఆహారం జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలు, టాక్సిన్లు మొదట పెద్ద పేగు ప్రారంభ భాగమైన సెకమ్‌లోకి చేరతాయి. అది మన శరీరంలో కుడివైపు ఉంటుంది

TV9 Telugu

ఆపై ఇవి క్రమంగా మన శరీరానికి ఎడమవైపు ఉన్న పెద్ద పేగు చివరి భాగమైన పురీష నాళంలోకి వెళ్తాయి. మనం ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు.. గురుత్వాకర్షణ కారణంగా కుడి నుంచి ఎడమకు ఈ వ్యర్థాలన్నీ సులభంగా కిందికి వెళ్లిపోతాయి

TV9 Telugu

తద్వారా ఉదయాన్నే ఈ వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటికి వెళ్లిపోవడం సులువవుతుంది. ఇలా పెద్ద పేగు ఎప్పటికప్పుడు పూర్తిగా ఖాళీ అవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది

TV9 Telugu

ఇది పొట్ట ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికీ దోహదం చేస్తుంది. అందుకే రాత్రి పడుకునేటప్పుడైనా, కాస్త విశ్రాంతి తీసుకునేటప్పుడైనా.. ఎడమవైపుకి తిరిగి పడుకోవడమే మేలంటున్నారు నిపుణులు

TV9 Telugu

అలాగే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిలో నిద్రా భంగిమ కూడా కీలకమే అంటున్నారు నిపుణులు. ఇదే దిశలో పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుందట తద్వారా గుండెపై ఒత్తిడి కాస్త తగ్గుతుంది