టీ రకాలలో బ్లాక్ టీ ఒకటి. ఈ బ్లాక్ టీలో గ్రీన్ టీ, పసుపు టీ లేదా వైట్ టీ కంటే టీ ఆకులు ఎక్కువగా ఆక్సీకరణం చెందుతాయి. అందుకే ఇది ఇతర టీ లకంటే బలంగా ఉంటుంది. అలాగే మంచి ప్రాచుర్యం కూడా పొందింది.
బ్లాక్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మన శరీరాన్ని ఎన్నో వ్యాధులు కలిగించే వైరస్‌లనుంచి కాపాడుతుంది. అసలు రోజూ బ్లాక్ టీ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం
బ్లాక్ టీ లో పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మం దెబ్బతినకుండా కాపాడుతాయి. అలాగే వృద్ధాప్య ప్రక్రియను మందగించడానికి కూడా సహాయపడతాయి.
బ్లాక్ టీలో ఉండే కాటెచిన్స్, ఫ్లేవనాయిడ్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ టీ తాగితే కొరోనరీ ఆర్టరీ పనితీరును మెరుగుపడుతుంది. దీంతో మీకు గుండె జబ్బులు రావు.
బ్లాక్ టీ పేగు సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. బ్లాక్ టీ ఇరుగ్గా ఉండే గాలి గొట్టాన్ని తెరుస్తుంది. అలాగే ఇది శ్వాసను సులభతరం చేస్తుంది. బ్లాక్ టీ ఉబ్బసంతో బాధపడేవారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.
బ్లాక్ టీ తాగితే జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇది ప్రీ మెనోపాజ్ సమయంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఆయిలీ స్కిన్ ఉన్నవారికి కూడా బ్లాక్ టీ మంచి ప్రయోజనకరం.
బ్లాక్‌టీ రేడియేషన్ బహిర్గతం వల్ల కలిగే చర్మ నష్టాన్ని సరిచేయడానికి కూడా సహాయపడుతుంది. బ్లాక్ టీ మన నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది.
ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే ఇది మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే ఇది మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బ్లాక్ టీ మన శరీరాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది.