Kids: తినమంటూ పిల్లలు మారాం చేస్తున్నారా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి చాలు..

పిల్లలు భోజనం చేయడానికి పేరెంట్స్‌ నానా తంటలు పడాల్సిందే. కాస్త తినే దానికి కూడా హంగామా చేస్తుంటారు. పోనీ తినకుండా వదిలేస్తే అసలే చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా వేసవిలో చిన్నారులు తినడానికి మారాం చేస్తుంటారు. అయితే కొన్ని రకాల సింపుల్ ట్రిక్స్‌ ఫాలో అయితే మారాం చేసే మీ పిల్లతో ఇట్టే తినిపించవచ్చు...

Kids: తినమంటూ పిల్లలు మారాం చేస్తున్నారా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి చాలు..
Kids
Follow us

|

Updated on: May 10, 2024 | 5:25 PM

పిల్లలు భోజనం చేయడానికి పేరెంట్స్‌ నానా తంటలు పడాల్సిందే. కాస్త తినే దానికి కూడా హంగామా చేస్తుంటారు. పోనీ తినకుండా వదిలేస్తే అసలే చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా వేసవిలో చిన్నారులు తినడానికి మారాం చేస్తుంటారు. అయితే కొన్ని రకాల సింపుల్ ట్రిక్స్‌ ఫాలో అయితే మారాం చేసే మీ పిల్లతో ఇట్టే తినిపించవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పిల్లలు ఆహారం తినలాంటే వారి తినే ఫుడ్‌ను డెకరేట్ చేయాలి. అలా అయితే వారు ఇష్టంగా తింటారు. ఉదాహరణకు మీ పిల్లలకు నచ్చిన సూపర్‌ హీరోలు లేదా కామిక్‌ క్యారెక్టర్లను పోలినట్లు శాండ్‌వించ్‌లను కట్‌ చేసి ఇవ్వండి. లేదా చపాతీని అలాంటి ఆకారాల్లో కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.

* ఇక చిన్నారులకు కేవలం అన్నం పెట్టాలనే భావనతోనే ఉండకూడదు. ఊహ తెలిసిందే వరకు వారికి నచ్చిన ఫుడ్‌లోనే విటమిన్లు అందేలా చూసుకోవాలి. ఉదాహరణకు పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్‌ వంటి వాటిని అందిస్తే వారి ఇష్టంతో పాటు ఆరోగ్యానికి కావాల్సినవి సైతం అందుతాయి.

* పిల్లలతో కలిసి భోజనం చేయడాన్ని అలవాటు చేయాలి. అందరూ కలిసి తినడం వల్ల చిన్నారులకు కూడా తినాలనే కోరిక వారిలోనూ పెరుగుతుంది. దీంతో ఇతరులను చూస్తూ వారు కూడా తినడానికి ఆసక్తి చూపిస్తారు.

* ఇక చిన్నారులకు అన్నం తినిపించే ముందు ఎట్టి పరిస్థితుల్లో చిరుతిళ్లు ఇవ్వకూడదు. ముఖ్యంగా చిప్స్‌, చాక్లెట్స్‌ వంటి వాటికి దూరంగా ఉంచాలి. ఇలాంటి వాటిని తీసుకుంటే పిల్లలో ఆకలి తగ్గిపోతుంది. పిల్లలు తినకపోవడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు.

* పండ్ల రసం వంటి లిక్విడ్ జ్యూస్‌లను చిన్నారులకు అలవాటు చేయాలి. తినడానికి కొన్ని గంటల ముందు జ్యూస్‌లు వంటివి ఇవ్వడం వల్ల వారిలో ఆకలి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ