మహిళలకు ఈ గింజలు ఒక వరం.. రోజూ తింటే ఆ బాధలు ఉండవు.. ఇవి తప్పక తెలుసుకోండి..

హోటల్‌లో తిన్న తర్వాత కేవలం మౌత్ ఫ్రెషనర్‌గా మాత్రమే వాడే సోంపు గింజల్లో.. వందల రోగాలను నయం చేసే అద్భుతమైన మెడిసిన్ దాగి ఉందంటే నమ్ముతారా..? ఇది మన శరీరాన్ని కూల్‌గా ఉంచడమే కాదు.. గ్యాస్, ఎసిడిటీ, నోటి దుర్వాసనతో పాటు మహిళల్లో వచ్చే పీరియడ్స్ నొప్పిని సైతం నిమిషాల్లో మాయం చేసే పవర్ ఈ చిన్న గింజలకు ఉంది.

మహిళలకు ఈ గింజలు ఒక వరం.. రోజూ తింటే ఆ బాధలు ఉండవు.. ఇవి తప్పక తెలుసుకోండి..
Fennel Seeds Health Benefits

Updated on: Jun 08, 2026 | 2:29 PM

ఇంట్లోని పోపుల పెట్టెలో ఉండే సోంపు కేవలం ఒక సాధారణ మసాలా దినుసు మాత్రమే కాదు, ఇది అనేక అద్భుత పోషకాలతో నిండిన ఒక గొప్ప ప్రకృతి ప్రసాదం. సాధారణంగా హోటళ్లలో భోజనం చేసిన తర్వాత మౌత్ ఫ్రెషనర్‌గా మాత్రమే వాడే సోంపులో.. ఎన్నో రకాల మొండి ఆరోగ్య సమస్యలను నయం చేసే ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అమెరికా వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం.. ప్రతి 100 గ్రాముల సోంపులో 1.24 గ్రాముల ప్రోటీన్, 3.1 గ్రాముల డైటరీ ఫైబర్ లభిస్తాయి. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, బి కాంప్లెక్స్, విటమిన్ ఎ, విటమిన్ ఇ, ల్యూటిన్, జెయాక్సాంథిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మండుతున్న వేసవి కాలంలో తలెత్తే చిన్న, పెద్ద ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సోంపు ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

వేసవి తాపానికి, వడదెబ్బకు పవర్‌ఫుల్ చెక్

వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోవడం, డీహైడ్రేషన్ బారిన పడటం, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు సర్వసాధారణం. అయితే సోంపునకు సహజంగానే శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన గుణం ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు టీ, కాఫీలకు బదులుగా సోంపుతో తయారుచేసిన సిరప్ లేదా సోంపు నీటిని తాగడం వల్ల శరీరానికి తక్షణ చల్లదనం లభిస్తుంది. ఇది ఎండ వేడి నుండి గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది.

గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు 5 నిమిషాల్లో ముగింపు..

చాలామంది భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండటం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. అలాంటి వారు తిన్న తర్వాత అర టీస్పూన్ సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమలాలి. ఇలా చేయడం వల్ల లాలాజలంతో పాటు సోంపులోని గుణాలు కలిసి జీర్ణ ఎంజైమ్‌లను వేగంగా ఉత్తేజపరుస్తాయి. ఇది ఆహారం త్వరగా మరియు సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడి, కడుపు ఉబ్బరాన్ని, ఎసిడిటీని తక్షణమే నివారిస్తుంది.

నోటి దుర్వాసన దూరం.. బెస్ట్ నాచురల్ మౌత్ ఫ్రెషనర్

నలుగురిలోకి వెళ్లినప్పుడు నోటి దుర్వాసన వల్ల చాలామంది ఆత్మవిశ్వాసం కోల్పోతుంటారు. కడుపులో విపరీతమైన వేడి, సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్లనే ఈ దుర్వాసన వస్తుంది. సోంపులో శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. రోజుకు 2 నుండి 3 సార్లు అర టీస్పూన్ సోంపు గింజలను నమలడం వల్ల నోట్లోని హానికర బ్యాక్టీరియా నశించి, శ్వాస తాజాగా మారుతుంది. ఇది కెమికల్స్ ఉండే మౌత్ ఫ్రెషనర్ల కంటే వంద రెట్లు మెరుగ్గా పనిచేస్తుంది.

పీరియడ్స్ నొప్పి, కడుపునొప్పికి రామబాణం

మహిళల్లో ఋతుస్రావ సమయంలో వచ్చే తీవ్రమైన కడుపునొప్పి, తిమ్మిరులు, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సోంపు నీరు ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ. ఒక టీస్పూన్ సోంపు గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని వడకట్టాలి. ఆ నీరు కొద్దిగా చల్లబడి గోరువెచ్చగా అయిన తర్వాత అందులో ఒక టీస్పూన్ స్వచ్ఛమైన తేనె కలుపుకుని కొద్దికొద్దిగా తాగాలి. ఇది కడుపు కండరాలను రిలాక్స్ చేసి నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

Follow Us