AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండగల అలసటను పోగొట్టుకుని కొత్త ఉత్సాహాన్ని పొందడం ఎలా?.. ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే సరి..

మన సంప్రదాయ పండగలు అంటేనే ఇళ్లు శుభ్రం చేయడం, పిండివంటలు చేయడం, బంధువులతో గడపడం, పూజలు, షాపింగ్‌లతో ఎంతో హడావుడిగా గడిచిపోతాయి. ఈ వేడుకలు మనకు అంతులేని ఆనందాన్ని ఇస్తాయడంలో సందేహం లేదు. కానీ, ఈ హడావుడి ముగిసేసరికి శరీరం, మనసు తీవ్రమైన అలసట బారిన పడతాయి. దీనినే ఫెస్టివ్ బర్న్‌అవుట్ అంటారు. పండగలు ముగిసిన తర్వాత శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి, ఉత్సాహంగా మారడానికి కొన్ని సులభమైన జీవనశైలి చిట్కాలను పాటించడం చాలా అవసరం.

పండగల అలసటను పోగొట్టుకుని కొత్త ఉత్సాహాన్ని పొందడం ఎలా?.. ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే సరి..
Feeling Tired After The Festivities
Jyothi Gadda
|

Updated on: Oct 21, 2026 | 7:42 AM

Share

పండగలు సంతోషాన్ని తెచ్చినప్పటికీ, నిరంతర పనులు, నిద్రలేమి కారణంగా శారీరకంగా, మానసికంగా తీవ్రమైన అలసట కలుగుతుంది. ఈ అలసటను అధిగమించడానికి పండగ ముగిసిన వెంటనే ఏం చేయాలి..? అలసట, నీరసం తగ్గాలంటే ఏం చేయాలి..? నిపుణులు చెప్పే ఆ చిట్కాలేంటో వివరాల్లోకి వెళితే..

ఒక రోజు పూర్తి విశ్రాంతి తీసుకోవడం

పండగల సమయంలో రాత్రి నిద్ర సరిగా లేకపోవడం, అధిక పనిభారం వల్ల శరీరం నీరసించిపోతుంది. కాబట్టి, పండగలు ముగిసిన వెంటనే వచ్చే రోజును పూర్తిగా విశ్రాంతికే కేటాయించాలి. ఎలాంటి హడావుడి పనులు పెట్టుకోకుండా శరీరానికి తగినంత నిద్ర, విశ్రాంతి ఇవ్వడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. హృదయ స్పందన రేటు సాధారణ స్థితికి చేరుకుంటుంది.

తేలికపాటి ఆహారం, హైడ్రేషన్

పండగ రోజుల్లో నూనెతో చేసిన వంటకాలు, స్వీట్లు, చక్కెర పదార్థాలు ఎక్కువగా తింటుంటాం. దీనివల్ల జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. పండగ తర్వాత కొద్ది రోజుల పాటు ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉండి, పీచు పదార్థాలు ఉండే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే, పండగ పనుల్లో నీళ్లు తాగడం మర్చిపోతుంటాం కాబట్టి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. రోజూ తగినన్ని నీళ్లు, కొబ్బరి నీరు లేదా మజ్జిగ తీసుకోవడం ద్వారా శరీరం హైడ్రేట్‌గా ఉండి శక్తి అందుతుంది.

ఇవి కూడా చదవండి

కండరాల నొప్పులకు స్ట్రెచింగ్

గంటల తరబడి పూజలు చేయడం, నిలబడటం లేదా ప్రత్యేక నృత్యాలు, వేడుకలలో పాల్గొనడం వల్ల కండరాలు బిగుసుకుపోయి నొప్పులు వస్తాయి. ఈ సమయంలో శరీరం తేలికగా ఉండేలా చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

ప్రశాంతమైన వాతావరణం, మానసిక ప్రశాంతత

అధిక జనం, బంధువుల రాకపోకలు, పనుల ఒత్తిడి వల్ల మానసికంగా కూడా అలసిపోతాం. పండగలు అయిపోయాక కాస్త ప్రశాంతమైన వాతావరణంలో, ఒంటరిగా లేదా మీకు ఇష్టమైన పుస్తకాలు చదువుతూ కొంత సమయం గడపండి. ఇది మీ మనసును ప్రశాంతపరుస్తుంది. మానసిక ఒత్తిడిని పూర్తిగా మాయం చేస్తుంది.

పండగలు సంతోషంగా ముగిసినా, శరీరం కోలుకోవడం కూడా అంతే ముఖ్యం. చిన్నపాటి విశ్రాంతి, సరైన ఆహారపు అలవాట్లతో పండగ అలసటను ఇట్టే తరిమికొట్టి, మరుసటి రోజు నుంచి మీ పనుల్లో మరింత ఏకాగ్రతతో, ఉత్సాహంగా పాల్గొనవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us