ప్రస్తుతం ఫోటోషూట్స్ సందడి ఎక్కువగా పెరిగిపోయింది. స్టార్ హీరోహీరోయిన్స్ ఫ్యాషన్ మారుతున్న బ్రాండ్స్ అనుగుణంగా ఫోటోషూట్స్ నిర్వహిస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట్లో చర్చకు దారితీసింది. ఫోటో షూట్ కోసం ఈ అమ్మడు చేసిన సాహసానికి ఫిదా కావాల్సిందే. ఇంతకీ ఆ నటి ఎవరా ? అని చూస్తున్నారా ? మీకు విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం సినిమా గుర్తుందా ? అందులో వెంకీ చిన్న చిన్న కుమార్తెగా నటించిన చిన్నారి గుర్తుందా ? ఈ సినిమా ఒరిజినల్ తమిళ్లో కమల్ హసన్ ప్రధాన పాత్రలో నటించారు. అందులో కూడా ఈ చిన్నారి ఎస్తర్ అనిల్.. కమల్ చిన్న కుమార్తేగా నటించింది. అది అప్పుడు.. కానీ ప్రస్తుతం ఆ చిన్నారి పెద్దదైంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్ ఇప్పుడు హీరోయిన్గా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
అవకాశాలను అందుకోవడానికి మార్గమైన ఫోటో షూట్స్‌పై దృష్టి పెట్టింది. లెటేస్ట్ ఫ్యాషన్ దుస్తులతో ఫోటో షూట్స్ నిర్వహిస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతలలో షేర్ చేస్తూ వస్తుంది. అయితే ఇటీవల తెలుగులో జోహార్ సినిమాలో హీరోయిన్గా నటించిన ఎస్తర్‌కు అనుకున్నంత గుర్తింపు రాలేదు. కాగా.. తాజాగా ఎస్తర్ చేసిన ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది. 44 కేజీల బరువున్న ఎస్తర్ తాజా ఫోటో షూట్లో అందమైన గౌను ధరించింది. అందులో ఎస్తర్ లుక్స్‌కు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అంత అందమైన ఆ గౌన్ బరువు మాత్రం అక్షరాల 58 కేజీలు. అవును.. 44 కేజీల బరువున్న ఎస్తర్.. 58 కేజీల బరువున్న గౌను ధరించి ఫోటో షూట్లో పాల్గొంది. తనకంటే 14 కేజీల బరువున్న గౌను ధరించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తన ఫోటోషూట్ పై స్పందించిన ఎస్తర్ మాట్లాడుతూ.. గౌను చూడగానే నచ్చిందని.. ఆ తర్వాత దానిని వేసుకున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఆ గౌను తయారీకి దాదాపు 30 రోజులు కష్టపడ్డారని తెలిపింది.
ట్వీట్..
Also Read: Upcoming Movies 2021: వినాయక చవితి కానుకగా థియేటర్స్‌లో సందడి చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు
Balakrishna: బాలయ్యను ఢీకొట్టనున్న మక్కల్ సెల్వన్.. మాస్ కాంబో అదిరిపోవాల్సిందే అంటున్న అభిమానులు..