Poor Nutrition: అతిగా ఆవలింతలు, తిమ్మిరులు వస్తున్నాయా.. జాగ్రత్త పడాల్సిందే!

|

Jul 06, 2024 | 6:24 PM

శరీరం, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాలైన పోషకాలు అవసరం. శరీరంలోని ఒక్కో భాగం పని చేయడానికి కొన్ని రకాల ఖనిజాలు, మినరల్స్, విటమిన్స్ అవసరం అవుతాయి. వీటిల్లో ఏవి తక్కువ.. ఎక్కువ.. ఉన్నా శరీరంపై చూపిస్తుంది. అయితే చాలా మంది ఆ తేడాలను అస్సలు గమనించారు. సాధారణంగా వస్తున్నాయిలే అని కొట్టి పారేస్తారు. కానీ ఆ చిన్న సమస్యలు కాస్తా.. పెద్దవిగా మారతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చాలా మందిలో తరచుగా..

Poor Nutrition: అతిగా ఆవలింతలు, తిమ్మిరులు వస్తున్నాయా.. జాగ్రత్త పడాల్సిందే!
Poor Nutrition
Follow us on

శరీరం, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాలైన పోషకాలు అవసరం. శరీరంలోని ఒక్కో భాగం పని చేయడానికి కొన్ని రకాల ఖనిజాలు, మినరల్స్, విటమిన్స్ అవసరం అవుతాయి. వీటిల్లో ఏవి తక్కువ.. ఎక్కువ.. ఉన్నా శరీరంపై చూపిస్తుంది. అయితే చాలా మంది ఆ తేడాలను అస్సలు గమనించారు. సాధారణంగా వస్తున్నాయిలే అని కొట్టి పారేస్తారు. కానీ ఆ చిన్న సమస్యలు కాస్తా.. పెద్దవిగా మారతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చాలా మందిలో తరచుగా ఆవలింతలు, తిమ్మిరులు వస్తూ ఉంటాయి. కానీ వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అవి ఏ సమస్యలకు సంకేతాలో తెలుసుకోవాలి. మీకు కూడా ఆవలింతలు, తిమ్మిరులు వస్తూ ఉంటే.. ఎందుకో ఇప్పుడు చూడండి.

శరీర నొప్పులు:

చేతులు, కాళ్ల కండరాల్లో నొప్పులు అనేవి వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న చిన్న పనులు చేసినా కూడా నొప్పులు వస్తున్నాయి అంటే.. అది మెగ్నీషియం, క్యాల్షియం లోపం వల్ల కావచ్చు. వెంటనే వెళ్లి వైద్యుల్ని సంప్రదించడం మంచిది. లేదంటే దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు.

కాళ్లు, చేతుల్లో తిమ్మిరులు:

చాలా మందికి కూర్చొన్నా, నిల్చున్నా, ఏదైనా పని చేసినా, పడుకున్నా కూడా కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి. కానీ చాలా మంది వీటిని అస్సలు పట్టించుకోరు. ఈ లక్షణాలు విటమిన్ బి12 లోపాన్ని సూచిస్తున్నాయి. దీన్ని అలాగే వదిలేస్తే ఒత్తిడి ఎక్కువై.. డిప్రెషన్‌లోకి వెళ్లొచ్చు.

ఇవి కూడా చదవండి

ఆవలింతలు రావడం:

సాధారణంగా నిద్ర సరిపోకపోయినా.. వస్తున్నా చెప్పడానికి ఆవలింతలు వస్తాయి. ఇవి అప్పుడప్పుడూ వస్తే పర్వాలేదు. కానీ తరచూ వస్తే మాత్రం మీలో సమస్య మొదలైందని అర్థం చేసుకోవాలి. కాస్త బలహీనంగా ఉన్నా, చిన్న పనులకు అలిసిపోతున్నా.. శరీరంలో ఇనుము లోపానికి సంకేతాలుగా కావచ్చు.

వెన్నులో నొప్పి:

కొంత మంది ఎప్పుడూ నడుము నొప్పి అని చెబుతూ ఉంటారు. కాళ్లు, చేతులు కీళ్లలో నొప్పులు ఉన్నా.. శరీరంలో విటమిన్ డి లోపించిందని చెప్పొచ్చు. విటమిన్ డి లోపం వల్ల తరచూ అనారోగ్యానికి గురి కావడం, ఆందోళన చెందడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..