నాన్ వెజ్ కంటే ఆకు కూరలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకు కూరల్లో శరీరానికి ఉపయోగ పడే అనేక రకాల పోషకాలు లభిస్తాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఉంటాయి. త్వరగా జీర్ణం అవుతాయి కూడా.. ఇలాంటి ఆకు కూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ ఆకు కూర చాలా రేర్‌గా లభిస్తుంది. గ్రామాల్లో విరివిగా లభించినా.. పట్టణాల్లో తక్కువగా ఉంటుంది. కానీ కనిపిస్తే మాత్రం కొనకుండా అస్సలు వదిలి పెట్టకండి. ఎలా చేసుకుని తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పొన్నగంటిని పోషకాలకు పుట్టగా చెబుతారు. అంటే అన్ని లెక్కలేని పోషకాలు లభిస్తాయి. ఈ ఆకు కూర తింటే ఎన్నో అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. సాధారణంగా ఎప్పుడూ తినే ఆకు కూరలు కాకుండా ఒక్కోసారి పొన్నగంటి కూడా తీసుకొస్తూ ఉండండి. మరి పొన్నగంటి కూర తినడం వల్ల ఎలాంటి అనారోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
పొన్నగంటి కూర తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ కూరలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శక్తిని ఇవ్వడంతో పాటు రోగాలతో పోరాడతాయి. త్వరగా ఇన్ఫెక్షన్స్ ఎటాక్ కాకుండా ఉంటాయి.
మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారు పొన్నగంటి కూర తినడం వల్ల అనేక తక్షణమే రిలీఫ్ పొందవచ్చు. రెగ్యులర్‌గా ఈ ఆకు కూర తింటే త్వరగా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏదోఒక రూపంతో తీసుకుంటే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
పొన్నగంటి కూర తినడం వల్ల త్వరగా అధిక బరువు నుంచి బయట పడొచ్చు. ఇందులో ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా తిన్నా త్వరగా కడుపు నిండుతుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. దీంతో త్వరగా బరువు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది.
షుగర్ వ్యాధి ఉన్నవారు ఏం తినాలా అని ఆలోచిస్తారు. కానీ పొన్నగంటి కూర తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆకు కూర తిన్నా, ఆకుల రసం ముఖం మీద రాసినా చర్మ సంబంధిత సమస్యల నుంచి కంట్రోల్ అవుతాయి. మచ్చలు లేకుండా ముఖం క్లీన్‌గా ఉంటుంది. చర్మ రంగు కూడా మెరుగు పడుతుంది.
పొన్న గంటి కూరలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఆకు కూర తింటే క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్ రాకుండా దూరంగా ఉండొచ్చు. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.