
తరాలు మారుతున్నా.. కొందరి రైతులు మాత్రం శాస్త్రీయ పద్దతులను ఫాలో అవుతూనే ఉంటారు. అలానే కాపు బాగా కాస్తుందని కొందరు రైతులు బొప్పాయి కాండానికి మేకులు కొడుతుంటారు. ఇలా చేయడం ద్వారా చెట్లలో ఒత్తతిడి పెరిగి అవి త్వరగా పూతకు వస్తాయని నమ్ముతారు. ఇలా మేకు కొట్టినప్పుడు చెట్టు ఒత్తిడికి గురై హెర్మాఫ్రోడైట్ అనే కాయలు కాసే పూల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని తద్వారా త్వరగా కాయలు కాస్తయని అంటారు. మరీ దీనికి శాస్త్రీయా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం.
శాస్త్రీయ ఆధారం ఏమిటి?
అయితే ఇలా చెట్టుకు మేకులు కొట్టడం ద్వారా కాపు పెరుగుతుందని.. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.. పైగా ఇలా చేయడం ద్వారా చెట్టుకు హాని కలిగే ప్రమాదం ఉందని చెబుతారు. శాస్త్రీయ ఆధారాల ప్రకారం.. చెట్టు కాపు అనేది పూర్తిగా మొక్క రకం, పోషణ, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, నీటిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మేకు కొట్టడం వల్ల కాండంలో గాయాలు ఏర్పడతాయి, ఇది ఫంగస్ లేదా బాక్టీరియా ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరి కాపు పెరిగేదెలా?
అయితే ఇలా మేకుల పద్దతి కాకుండా కొన్ని సహజ పద్దతుల ద్వారా కాపును పెంచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బొప్పాయి కాపు త్వరగా రావాలంటే దానికి సూర్యరశ్మీ ఎంతో అవసరం అని.. కనీసం 6-8 గంటల సూర్యరశ్మీ చెట్టుకు తగిలేలా చూడాలని చెబుతున్నారు. అలాగే మొక్కల పెరుగుదల కోసం కంపోస్ట్, వర్మీకంపోస్ట్, పొటాష్ ఎరువులను వేయాలని.. నాటేటప్పుడు, మంచి నాణ్యత గల విత్తనాలు వేయాలని సూచించారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.