Water Bottle: వాటర్ బాటిల్‌ను ఎన్ని రోజులు వాడాలి?.. ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు తాగడం సురక్షితమేనా?

సాధారణంగా మనం ప్యాక్ చేసిన డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను కొన్నప్పుడు వాటిపై ఎక్స్‌పైరీ డేట్ ఉండటం చూస్తాం. అయితే, చాలా మంది ఆ డేట్ వాటర్‌ది అనుకుంటారు. కానీ అది ఆ నీటిని నిల్వ చేసిన ప్లాస్టిక్ బాటిల్‌దని చాలా మందికి తెలియదు. అయితే ఎక్స్‌పైరీ అయన బాటిట్‌లో నీటిని తాగడం వల్ల మనకు అనేక ఆరోగ్య సమస్యలు రావచొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వాటర్ బాటిల్‌ను ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని రోజులకు మార్చాలో ఇక్కడ తెలుసుకుందాం.

Water Bottle: వాటర్ బాటిల్‌ను ఎన్ని రోజులు వాడాలి?.. ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు తాగడం సురక్షితమేనా?
Plastic Water Bottle Expiry

Updated on: Jun 03, 2026 | 5:15 PM

ప్రస్తుత రోజుల్లో ప్రయాణాల్లో ఉన్నప్పుడైనా, ఆఫీసు లేదా స్కూళ్లకు వెళ్లేటప్పుడైనా మన వెంట వాటర్ బాటిల్ ఉండటం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను మనం ఎక్కువగా కొంటూ ఉంటాం. అయితే, మనం కొనే ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్‌పై ఉండే ఎక్స్‌పైరీ డేట్ ను మీరు ఎప్పుడైనా గమనించారా?.. ఈ డేట్‌ ముగిస్తే చాలామంది బాటిల్‌లోని నీరు పాడైపోతుందేమో అనుకుంటారు, కానీ అసలు నిజం ఏమిటంటే ఆ డేట్.. నీటికి కాదు, ఆ నీటిని నిల్వ ఉంచిన ప్లాస్టిక్ బాటిల్‌ది అని చాలా మందికి తెలియదు. ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల అవి మన శరీరంలోకి నెమ్మదిగా విషాన్ని ఎలా పంపుతాయో, అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ బాటిళ్లను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలో తెలుసుకుందాం.

ఎక్స్‌పైరీ అయిన బాటిల్‌లోని నీటిని తాగితే కలిగే నష్టాలు

కాలం చెల్లిన ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిని తాగడం వల్ల ప్లాస్టిక్‌లోని రసాయనాలు రక్తంలో కలిసి శరీర భాగాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. బాటిల్‌ నుంచి విడుదలైన విష పదార్థాలు శరీరంలోకి వెళ్లిన తర్వాత చాలా నెమ్మదిగా పనిచేస్తాయి. కాబట్టి మనం త్వరగా దీనిని గుర్తించలేము. అయితే ఒకటి లేదా రెండుసార్లు ఇలాంటి నీటిని తాగితే పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ దీనిని అలవాటుగా మార్చుకుని నిరంతరం తాగితే మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.

వాటర్ బాటిళ్లను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి?

ఆరోగ్యంగా ఉండటానికి ప్లాస్టిక్ బాటిళ్ల విషయంలో ఈ క్రింది జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. రైలు ప్రయాణాల్లో లేదా దుకాణాల్లో కొనే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. వాటిని మళ్లీ మళ్లీ వాడకూడదు. అలాగే ఇంట్లో నిరంతరం ఉపయోగించే ప్లాస్టిక్ బాటిళ్లను ప్రతి 1 నుండి 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మార్చాలి. బాటిల్‌పై ఎక్కడైనా గీతలు లేదా పగుళ్లు కనిపిస్తే, దానిని వెంటనే పారేసి కొత్త బాటిల్ కొనాలి. ప్లాస్టిక్ బాటిల్ రంగు మారినట్లు అనిపిస్తే, అది ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని అర్థం. వెంటనే దాని వాడకం ఆపేయాలి.

ఇన్సులేటెడ్ లేదా వ్యాక్యూమ్ బాటిళ్ల మూతల్లో ఉండే రబ్బర్ సీల్ పాడైపోతే, ఆ మూతను లేదా బాటిల్‌ను వెంటనే మార్చడం మంచిది. మన తాగే నీరు, తినే ఆహారంపైనే మన పూర్తి ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ వాటర్ బాటిల్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. అలాగే సమయానికి వాటిని మారుస్తూ ఉండండి. ప్లాస్టిక్‌కు బదులుగా గాజు, రాగి లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లను ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us