Health News: భోజనాన్ని నేలపై కూర్చొని తింటే ఎన్ని లాభాలో తెలుసా..

|

Nov 22, 2024 | 5:57 PM

కింద నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కింద కూర్చొని తింటే జీర్ణ క్రియ, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థలకు చాలా మంచిది..

Health News: భోజనాన్ని నేలపై కూర్చొని తింటే ఎన్ని లాభాలో తెలుసా..
Health News
Follow us on

భోజనం అయినా, టిఫిన్ అయినా కింద కూర్చొని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటున్నారు. కానీ పూర్వం మాత్రం కేవలం నేలపై మాత్రమే కూర్చొని భోజనం చేసేవారు. ఆ తర్వాత డైనింగ్ టేబుల్స్, కుర్చీలపై, మంచాలపై కూర్చొని తింటున్నారు. కింద నేలపై కూర్చొని తినడం వల్ల జీవక్రియకు చాలా మంచిది. ఆహారంలోని పోషకాలు.. సక్రమంగా అందుతాయి. అప్పట్లో తినేటప్పుడు కేవలం ఆహారం మీద మాత్రమే దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు టీవీలు, సెల్ ఫోన్స్ చూస్తూ తింటున్నారు. ఇలా తినడం వల్ల తిన్న ఆహారం కూడా వంట పట్టదని ఇంట్లో పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. కానీ ఈ మాటను కొట్టిపారేస్తూ ఉంటారు. నిజానికి వాళ్లు చెప్పింది నిజమే. కింద కూర్చొని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూడండి.

సుఖాసనం:

కింద నేలపై కాళ్లు మడిచి కూర్చోవడం అనేది సుఖాసనం కింద లేక్కకు వస్తుంది. ఇలా కూర్చోవడం వల్ల జీర్ణ క్రియ అనేది పెరిగి.. ఆహారంలోని పోషకాలు గ్రహించేందుకు వీలు ఉంటుంది. ఈ భంగిమ సహజంగానే ఉదర కండరాలను సడలిస్తుంది. మల బద్ధకం, అజీర్తిని తగ్గిస్తుంది.

నాడీ వ్యవస్థకు మంచిది:

నేలపై కాలు మడిచి కూర్చోవడం వల్ల నరాలకు ఎంతో సపోర్ట్‌గా ఉంటుంది. ఇది జీర్ణ క్రియలో కీల రోల్ పోషిస్తాయి. నాడీ వ్యవస్థను కూడా నియంత్రిస్తుంది. ఈ భంగిమ వేయడం వల్ల చాలా ప్రశాంతంగా, రిలాక్సింగ్‌గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జీవక్రియ పెరుగుతుంది:

నేలపై కూర్చొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీవక్రియను కూడా మెరుగు పరుస్తుంది. తిన్న ఆహరంలోని పోషకాలు సక్రమంగా అందేలా చేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా, ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

తక్కువగా తింటారు:

నేలపై కూర్చొని సుఖాసనంలో భోజనం తింటే తక్కువగా తినేందుకు వీలు ఉంటుంది. చక్కగా నమిలి తింటే దంతాలకు కూడా మంచిది. నోటి పని తీరుకు సహాయ పడుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. నాలుక కదలికలు మెరుగు పరుస్తాయి. వెన్నుపాము కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.