Navratri Fasting: నవరాత్రుల్లో ఉపవాసాలు చేస్తూ ఎనర్జిటిక్‌గా ఉండాలంటే ఇలా చేయండి..

|

Oct 05, 2024 | 1:11 PM

నవరాత్రులు మొదలయ్యాయి. అమ్మ వారిని ఎంతో భక్తి శ్రద్దలతో మహిళలు పూజిస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది మహిళలు ఉపవాసాలు ఉంటారు. ఎవరైనా సరే ఉపవాసాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఉపవాసం అనగానే చాలా మంది పాలు, టీలు, జ్యూసులు, పండ్లు తీసుకుంటారు. కొంతమంది అసలు ఏమీ తినరు. ఉపవాసం చేసేటప్పుడు..

Navratri Fasting: నవరాత్రుల్లో ఉపవాసాలు చేస్తూ ఎనర్జిటిక్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
Navratri Fasting
Follow us on

నవరాత్రులు మొదలయ్యాయి. అమ్మ వారిని ఎంతో భక్తి శ్రద్దలతో మహిళలు పూజిస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది మహిళలు ఉపవాసాలు ఉంటారు. ఎవరైనా సరే ఉపవాసాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఉపవాసం అనగానే చాలా మంది పాలు, టీలు, జ్యూసులు, పండ్లు తీసుకుంటారు. కొంతమంది అసలు ఏమీ తినరు. ఉపవాసం చేసేటప్పుడు అది శరీరంపై ఎలాంటి నెగిటివ్ ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేస్తే.. నవరాత్రుల్లో ఉపవాసం చేసినా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఉపవాసాల సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చు? అనేది ఇప్పుడు చూద్దాం.

పండ్లు:

తాజా పండ్లు తినడం వల్ల ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తాయి. అరటి పండ్లు, యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, సీజనల్ ఫ్రూట్స్ వంటివి తీసుకోవడం ముఖ్యం.

సబుదానా:

సబుదానాలో తినడం వల్ల ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇందులో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటిని తినగానే తక్షణ శక్తి వస్తుంది. సబుదానాతో కిచిడీ, స్నాక్స్‌గా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు కూడా లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

వాటర్ చెస్ట్‌నట్స్:

ఈ వాటర్ చెస్ట్ నట్స్‌లో కూడా కేలరీలు తక్కువగా, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా లభిస్తాయి. వీటిని మీరు స్నాక్‌ రూపంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ వాటర్ చెస్ట్ నట్స్ తింటే తక్షణ శక్తి లభిస్తుంది. మీరు రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు.

కొబ్బరి:

ఉపవాస సమయాల్లో మీరు కొబ్బరి తిన్నా లేక కొబ్బరి నీటిని తాగినా ఎంతో ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇందులో మంచి కొవ్వులు లభిస్తాయి. హైడ్రేషన్ కూడా అందుతుంది. బాడీ డీ హైడ్రేట్ కాకుండా కొబ్బరి చూస్తుంది.

చిలకడ దుంపలు:

ఉపవాస సమయాల్లో తినాల్సిన మంచి పోషకాహారాల్లో చిలకడ దుంపలు కూడా ఒకటి. ఇందులో ఫైబర్, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి వీటిని తింటే దీర్ఘకాలిక శక్తి లభిస్తుంది. కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. మీ శక్తి స్థాయిలు పెంచుకోవడానికి ఇది బెస్ట్.

పెరుగు:

పెరుగు అనేది ప్రోబయోటిక్స్‌కి మూలంగా చెబుతారు. ఈ పెరుగులో ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఉపవాస సమయంలో మీరు పెరుగును హ్యాపీగా తీసుకోండి. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. మీ శక్తి కూడా పెరుగుతంది. నీరసం, అలసట తగ్గుతాయి.

నట్స్:

పోషకాహారాల్లో నట్స్ కూడా ఒకటి. వీటిని ఉపవాస సమయంలో తీసుకుంటే మీకు మంచి ఆరోగ్యంతో పాటు శక్తి కూడా లభిస్తుంది. అదే విధంగా మిల్లెట్స్ తీసుకున్నా మంచిదే.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..