Tamarind Seeds: చెత్తలో పడేసే ఈ గింజలతో షుగర్ కంట్రోల్ చేయవచ్చని మీకు తెలుసా..

|

Oct 13, 2024 | 2:35 PM

షుగర్ వ్యాధి ఈ మధ్య కాలంలో ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు దీని బారిన పడుతున్నారు. ఇంతకుముందు కేవలం 50 లేదా 60 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు 20 ఏళ్ల వయసులో ఉన్నవారికి సైతం వచ్చేస్తుంది. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగానే ప్రస్తుత కాలంలో దీర్ఘ కాలిక వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. లైఫ్ లాంగ్ చాలా బాధ పడాల్సి ఉంటుంది. కాబట్టి ముందు..

Tamarind Seeds: చెత్తలో పడేసే ఈ గింజలతో షుగర్ కంట్రోల్ చేయవచ్చని మీకు తెలుసా..
Diabetes
Follow us on

షుగర్ వ్యాధి ఈ మధ్య కాలంలో ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు దీని బారిన పడుతున్నారు. ఇంతకుముందు కేవలం 50 లేదా 60 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు 20 ఏళ్ల వయసులో ఉన్నవారికి సైతం వచ్చేస్తుంది. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగానే ప్రస్తుత కాలంలో దీర్ఘ కాలిక వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. లైఫ్ లాంగ్ చాలా బాధ పడాల్సి ఉంటుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ క్రమంలోనే చింత గింజలతో కూడా డయాబెటీస్‌ను కంట్రోల్ చేసుకోవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. చాలా మంది చింత పండులో వచ్చే గింజలను పడేస్తూ ఉంటారు. కానీ ఈ చింత గింజలతో కూడా మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉణ్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ కంట్రోల్:

చింత గింజలను ఎండలో బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత వేయించి పైన పొట్టు తీసేసి..పొడి చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఓ గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అరస్పూన్ కలిపి వేయించాలి. ఈ నీటిని ఉదయం, సాయంత్రం తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే మీరు తినే ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి. షుగర్ లేని వాళ్లు పరగడుపున తాగితే చాలా మంచిది. రక్తంలోని షుగర్ లెవల్స్‌ని తగ్గిస్తుంది.

బాడీ పెయిన్స్ తగ్గుతాయి:

చింత గింజల పొడిని తీసుకోవడం వల్ల బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయి. బాడీ పెయిన్స్‌తో బాధ పడేవారు ఈ నీటిని రెండు రోజులు తాగితే దెబ్బకు కంట్రోల్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్:

ఉదయాన్నే బ్రెష్ చేసిన తర్వాత చింత గింజల పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల చాలా మంచిది. జీవక్రియ మెరుగు పడుతుంది. అంతే కాకుండా జీర్ణ సంబందిత సమస్యలు కూడా తగ్గుతాయి.

రక్త హీనత తగ్గుతుంది:

ప్రస్తుత కాలంలో చాలా మంది రక్త హీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు ఈ నీటిని తాగితే కొద్ది రోజుల్లోనే హిమోగ్లోబిన్ శాతం అనేది పెరుగుతుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్:

ప్రస్తుత కాలంలో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో ఈ పొడి కలుపుకుని తాగితే.. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. దీని వల్ల గుండెపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. చర్మానికి కూడా చాలా మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..