Cooling Plants: ఇంటిని చల్లబరిచే కూలింగ్ ప్లాంట్స్.. ఇదిగో లిస్ట్!

|

Jul 05, 2024 | 5:46 PM

మొక్కలు అంటే ఎంతో మందికి ఇష్టం. ఇంటి నిండా ఇప్పుడు మొక్కలు పెట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఇది మంచి విషయమే అనుకోండి. కానీ ఎక్కడ పడితే అక్కడ.. ఏ మొక్కలు పడితే వాటిని ఇంట్లో పెట్టడం అస్సలు మంచిది. మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొక్కల్లో కూడా కొన్ని హాని చేసేవి ఉంటాయి. వాటి నుంచి విష వాయువులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా అడిగి మరీ మంచి మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల..

Cooling Plants: ఇంటిని చల్లబరిచే కూలింగ్ ప్లాంట్స్.. ఇదిగో లిస్ట్!
Cooling Plants
Follow us on

మొక్కలు అంటే ఎంతో మందికి ఇష్టం. ఇంటి నిండా ఇప్పుడు మొక్కలు పెట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఇది మంచి విషయమే అనుకోండి. కానీ ఎక్కడ పడితే అక్కడ.. ఏ మొక్కలు పడితే వాటిని ఇంట్లో పెట్టడం అస్సలు మంచిది. మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొక్కల్లో కూడా కొన్ని హాని చేసేవి ఉంటాయి. వాటి నుంచి విష వాయువులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా అడిగి మరీ మంచి మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. అయితే మొక్కల్లో కూడా కూలింగ్ ప్లాంట్స్ ఉన్నాయండోయ్. కానీ ఇప్పుడు ఎందుకు అంటున్నారా.. ఎండలు తగ్గినా ఉక్క పోత మాత్రం తగ్గలేదు. గాల్లో ఉండే తేమ కారణంగా ఉక్కపోతగా ఉంటుంది. దీని వలన చికాకుగా ఉంటోంది. ఇలాంటి సమయంలో గాలిలో తేమను తగ్గించి.. సహజంగానే ఇంటిని చల్లబరిచే మొక్కలు చాలా మంచివి. మరి ఆ ప్లాంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా.

స్నేక్ ప్లాంట్:

స్నేక్ ప్లాంట్ గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. చాలా మంది ఇప్పుడు వీటిని కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారు. స్నేక్ ప్లాంట్ ఎక్కడైనా సులభంగా పెరుగుతుంది. ఈ ప్లాంట్ కేవలం పగలు మాత్రమే కాదు.. రాత్రి పూట కూడా ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఈ మొక్కను ఇంట్లో ఉంచుకోవచ్చు.

అలోవెరా:

కలబంద మొక్క వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగానే కాకుండా చర్మ, జుట్టు సంరక్షణకు కూడా ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. ఈ మొక్క ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా ఉంటుంది. దీన్ని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

పీస్ లిల్లీ:

పీస్ లిల్లీ కూడా తెల్లటి పువ్వులతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. చాలా మంది దీన్ని బయటే పెంచాలి అనుకుంటారు. కానీ ఏమీ అవసరం లేదు. తక్కువ వెలుతురు ఉన్నా చాలు. ఇంట్లో ఏదో ఒక మూల పెడితే చాలు. ఇది గాలిని శుద్ధి చేస్తుంది. ఇంటిని చల్లగా ఉంచుతుంది.

చైనీస్ ఎవర్ గ్రీన్:

మొక్కల్ని ఎక్కువగా పెంచే వారికి ఈ మొక్క గురించి బాగా తెలిసే ఉంటుంది. ఇది చాలా అరుదైన మొక్క. తక్కువ నీటిలో.. ఎక్కడైనా పెరుగుతుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇది గాలిని శుద్ధి చేయడంతో పాటు.. ఇంటిని చల్లగా ఉంచుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..