పిల్లలకు చెవి నొప్పి వస్తే.. నూనె వేసే అలవాటు మీకూ ఉందా?

పిల్లలకు అనారోగ్యంగా ఉంటే సాధారణంగా వీలైనంత వరకు ఆయుర్వేద పద్ధతులను అనుసరించే చికిత్స చేసేందుకు చాలా మంది తల్లిదండ్రులు ఇష్టపడతారు. దీంతో తెలిసీ తెలియని పద్ధతులను అవలంభించి తమ పిల్లల ఆరోగ్యానికి మరింత హాని కలిగించే ఇంటి నివారణలను ప్రయత్నిస్తారు. వీటిలో ఒకటి పిల్లల చెవిలో..

పిల్లలకు చెవి నొప్పి వస్తే.. నూనె వేసే అలవాటు మీకూ ఉందా?
Oil For Earache In Kids

Updated on: Feb 08, 2026 | 12:55 PM

ఇంట్లో పిల్లలకు అనారోగ్యంగా ఉంటే సాధారణంగా వీలైనంత వరకు ఆయుర్వేద పద్ధతులను అనుసరించే చికిత్స చేసేందుకు చాలా మంది తల్లిదండ్రులు ఇష్టపడతారు. దీంతో తెలిసీ తెలియని పద్ధతులను అవలంభించి తమ పిల్లల ఆరోగ్యానికి మరింత హాని కలిగించే ఇంటి నివారణలను ప్రయత్నిస్తారు. వీటిలో ఒకటి పిల్లల చెవిలో నూనె వేసే పద్ధతి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరాల్లో కూడా ఈ పద్ధతిని అనుసరించే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఈ ఇంటి నివారణలను ప్రయత్నించడం వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. పిల్లలకు చెవి నొప్పి వచ్చినప్పుడు వెంటనే తల్లిదండ్రులు పిల్లల చెవిలో కొన్ని చుక్కల ఆవాల నూనె వేస్తారు. మైనం పేరుకుపోయినప్పుడు కూడా పిల్లల చెవిలో నూనె వేస్తారు. ఇది చాలా సాధారణమని మనందరికీ తెలుసు. కానీ ఇది నిజంగా చెవి నొప్పిని తగ్గిస్తుందా? దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో? ఇక్కడ తెలుసుకుందాం..

మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలోని ENT విభాగం అధిపతి ప్రొఫెసర్ రవి మెహర్ మాట్లాడుతూ.. పిల్లలకి చెవి నొప్పి ఉంటే, అది ఇన్ఫెక్షన్ లేదా మరేదైనా సమస్య వల్ల కావచ్చు. ఇటువంటి పరిస్థితిలో వారి చెవులలో నూనె వేయకూడదు. ఈ పద్ధతి సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నూనె వేయడం వల్ల ఇన్ఫెక్షన్ నయం కాదు. నొప్పి తగ్గదు. నూనె బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలను మరింత ప్రోత్సహిస్తుంది. ఇది నొప్పి, వాపు, మంట వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. అంతేకాకుండా చెవి నుంచి చీము లేదా నీరు కారినప్పుడు నూనె వేయకూడదు. పిల్లలకి జలుబు లేదా జ్వరం వచ్చినప్పుడు చెవి నొప్పి రావచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మీరు మొదట వైద్యుడిని సంప్రదించడం మంచిది.

చెవి నొప్పి వచ్చినప్పుడు ఏమి చేయాలి?

పిల్లలకు చెవినొప్పి లేదా మరేదైనా సమస్య ఉంటే వెంటనే ENT వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇంటి నివారణలను ప్రయత్నించడం వల్ల సమస్య మరింత తీవ్రమై హాని కలుగుతుంది. మీరు చెవిని శుభ్రం చేయాల్సి వస్తే, ఇయర్‌బడ్‌ను ఉపయోగించవచ్చు. కానీ దానిని చాలా లోతుగా చొప్పించకూడదు. అలాగే, వైద్యుల మార్గదర్శకత్వం లేకుండా పిల్లల చెవుల్లో ఎలాంటి చుక్కలు వేయవద్దు. పిల్లలకి చెవి సమస్య ఉంటే వారు తరచుగా ఏడుస్తారు లేదా చెవులను పట్టుకుంటారు. వారికి వినికిడి సమస్యలు కూడా ఉండవచ్చు. ఇలాంటి సమయాల్లో వారికి మందులు ఇవ్వడం, పిల్లల వైద్యుల సలహా మేరకు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. వీటన్నిటితో పాటు పిల్లలకు స్నానం చేయించేటప్పుడు నీరు లేదా సబ్బు చెవిలోకి వెళ్లకుండా చూసుకోవాలి. చల్లని వాతావరణంలో పిల్లల చెవులను వీలైనంత వెచ్చగా ఉంచడానికి ఉన్ని వస్త్రాలను తల, చెవులు కప్పి ఉంచేలా ధరింపజేయాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us