
వేరుశనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాల ఖనిజం. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే పల్లీలను ఉడికించి తినడం మంచిదా, లేక వేయించి తినడం మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, వేరుశనగల్లో విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్, నియాసిన్, ఫోలేట్, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఐరన్ మరియు మెగ్నీషియం వంటి అనేక పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకునేవారు ఉడికించిన పల్లీలను స్నాక్స్‌గా తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది.
మధుమేహం ఉన్నవారికి మేలు: షుగర్ వ్యాధితో బాధపడేవారు వేయించిన వాటి కంటే ఉడికించిన పల్లీలను తినడం చాలా ఉత్తమం. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా స్థిరంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యం: హై బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు ఉడికించిన పల్లీలను మితంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్‌ను పెంచకుండా రక్తపోటును బ్యాలెన్స్ చేస్తాయి.
వేయించిన పల్లీలు చాలా రుచిగా, క్రంచీగా ఉంటాయి. వీటిని అప్పుడప్పుడు స్నాక్‌గా తీసుకోవచ్చు. అయితే నూనెలో వేయించి, మసాలాలు కలిపిన పల్లీలను మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. సాధారణ డ్రై రోస్ట్ చేసిన పల్లీలను మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు.
మొత్తంగా చూస్తే, వేయించిన పల్లీలతో పోలిస్తే ఉడికించిన పల్లీలు ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా నిలుస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఫిట్నెస్ ఆశించేవారు ఉడికించిన వేరుశనగలను తమ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..