పది నిమిషాల వాకింగ్‌తో ఆర్థరైటీస్‌కు చెక్

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. ఈ బిజీ షెడ్యూల్లో వ్యాయామానికి ఖాళీ ఎక్కడిది అని ప్రశ్నించే వాళ్లూ ఉంటున్నారు. కానీ.. ఓ పదినిమిషాల వాకింగ్‌ వల్ల ఎన్నో లాభాలున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉదయం వాకింగ్ చేయడం ద్వారా చాలా రకాలైన వ్యాధులకు బైబై చెప్పవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కేవలం రోజు పదినిమిషాల వాకింగ్ వల్ల ఆర్థరైటీస్‌కు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు . వాకింగ్ చేస్తున్నప్పుడు శరీరంలో ఉన్న కండరాలన్నీ ఒక్కసారిగా ఉత్తేజమవుతాయని.. దీంతో.. […]

పది నిమిషాల వాకింగ్‌తో ఆర్థరైటీస్‌కు చెక్
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2019 | 10:37 AM

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. ఈ బిజీ షెడ్యూల్లో వ్యాయామానికి ఖాళీ ఎక్కడిది అని ప్రశ్నించే వాళ్లూ ఉంటున్నారు. కానీ.. ఓ పదినిమిషాల వాకింగ్‌ వల్ల ఎన్నో లాభాలున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉదయం వాకింగ్ చేయడం ద్వారా చాలా రకాలైన వ్యాధులకు బైబై చెప్పవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కేవలం రోజు పదినిమిషాల వాకింగ్ వల్ల ఆర్థరైటీస్‌కు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు .

వాకింగ్ చేస్తున్నప్పుడు శరీరంలో ఉన్న కండరాలన్నీ ఒక్కసారిగా ఉత్తేజమవుతాయని.. దీంతో.. కాళ్లల్లో ఎలాంటి నొప్పులు ఉన్నా వాటంతట అవే తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘స్టియో ఆర్థరైటిస్’ వయస్సు ఎక్కువగా ఉన్న వారిలో సాధారణంగా కనిపించే వ్యాధి. ఎందుకంటే.. వయస్సు మీదపడే కొద్దీ కండరాలలో కదలిక తగ్గుతుంది. కాబట్టి ముసలివాళ్లకు వాకింగ్ తప్పనిసరి అని సూచిస్తున్నారు. 49 నుంచి 83 ఏళ్ల వయస్సులో ఉన్నవారు ఖచ్చితంగా వాకింగ్ చెయ్యాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ప్రతిరోజూ 10 నిమిషాల కంటే తక్కువ సమయం వాకింగ్ చేసిన వారు రోజువారీ పనులు ఈజీగా చేసుకోవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. అదే రోజూ.. ఒక గంటలో వాకింగ్ చేసిన వారిలో 85 శాతం మంది చలనశీలత ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.

హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్టుమెంట్ వారి పరిశోధన ప్రకారం.. ఆర్థరైటీస్ ఉన్న వాళ్లపై రీసెర్చ్ నిర్వహించగా.. రోజూ వ్యాయామం చేసిన వారికి.. చేయని వారికీ చాలా తేడాలు ఉన్నాయని గుర్తించారు. వ్యాయామం చేయని వారు రోజూ ఒక వీధిని దాటడానికి చాలా సమయం తీసుకునేవారని తెలిపారు. కాబట్టి రోజూ ఉదయం వాకింగ్ చేయడం వల్ల చాలా మంచిదని తెలియజేశారు.