యువతా నీవెక్కడ…గ్రేటర్‌లో ముఖం చాటేసిన టెక్కీలు.. సోషల్ మీడియాలో ఊదరగొట్టే నెటిజన్లు ..

ఓటు హక్కును పొందాలి, తమకు నచ్చిన నాయకుడ్ని ఎన్నుకోవాలి అన్న ఆలోచనలకు విరుద్ధంగా గ్రేటర్ హైదరాబాద్ నగర యువత కనిపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో అంతగా పోలింగ్‌ సందడి కనిపించడం లేదు.

యువతా నీవెక్కడ...గ్రేటర్‌లో ముఖం చాటేసిన టెక్కీలు.. సోషల్ మీడియాలో ఊదరగొట్టే నెటిజన్లు  ..
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Dec 01, 2020 | 3:48 PM

Young Voters : ఓటు హక్కును పొందాలి, తమకు నచ్చిన నాయకుడ్ని ఎన్నుకోవాలి అన్న ఆలోచనలకు విరుద్ధంగా గ్రేటర్ హైదరాబాద్ నగర యువత కనిపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో అంతగా పోలింగ్‌ సందడి కనిపించడం లేదు. ఉదయం నుంచి మందకొడిగానే పోలింగ్‌ సాగుతోంది. ఓటు వేసేందుకు యువకులు ముందుకు రావడం లేదు. యువత కంటే వృద్ధులు, వికలాంగులే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనారోగ్యాన్ని కూడా వారు లెక్కచేయడం లేదు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో ధైర్యంగా ముందుకు వస్తున్నారు.

అయితే వృద్ధుల్లో ఉన్న చైతన్యం యువకుల్లో కనిపించడం లేదు. ఏ పోలింగ్‌ కేంద్రాన్ని తీసుకున్నా.. యువకులు చూద్దామన్నా కనిపించడం లేదు. వయసుపై బడ్డ వారు వృద్ధులే ముందుకు రావడం విశేషం. యువకులు మాత్రం ఇంట్లో నుంచి కదలకపోవడం వారిలో ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో పాటు ప్రైవేట్‌ ఎంప్లాయిస్‌ ఎక్కడా ఓటు వేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టెకీలు, యువత ఓటింగ్‌కు దూరంగా ఉన్నాట్లుగా కనిపించింది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే వీరు.. ఓటింగ్‌ వచ్చేసరికి మాత్రం డిస్టెన్స్ ‌‌ పాటించినట్గాలుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల్లో యువత, కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సహంగా ఉంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్‌లో కనిపించింది.

హైదరాబాద్‌.. అంతర్జాతీయంగా రూపుదిద్దుకుంటున్న నగరం. కోటి 30లక్షలకుపైగా జనం. బిజీ లైఫ్‌లో ఎప్పుడూ సందడిగా కనిపించే భాగ్యనగర జనానికి ఏమైంది. నగర ఓటర్లు ఏమయ్యారు.. ఎందుకు పోలింగ్‌ కేంద్రాల దగ్గర కనిపించడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఏమైనా సమస్యలుంటే నిలదీసే జనం.. ఆ సమస్యను తీర్చే నేతలను ఎన్నుకునే టైంలో ఎక్కడున్నారు. ఎందుకు ముందుకు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వార్డుల సమస్యలపై గళమెత్తే ఓటర్లు.. కీలకటైంలో ఓ నిర్ణయం తీసుకుని తమకు అండగా ఉండే నేతలను ఎన్నుకోవల్సింది పోయి ముఖం చాటేయడం చర్చనీయాంశంగా మారింది.

కోటికి పైగా జనాభా ఉన్నా.. ఓటర్ల సంఖ్య మాత్రం 74లక్షల 44, 260గా ఉంది. గత ఎన్నికల్లో 74 లక్షలకుపైగా ఓటర్లు ఉంటే.. పోలింగ్‌లో పాల్గొన్నది కేవలం 33 లక్షల 62,688 మంది మాత్రమే. అప్పుడు 45.29 శాతం పోలింగే నమోదైంది. ఇప్పుడు కూడా అదే రిపీట్‌ అవుతుందా.. లేక ఇంకా తక్కువ ఓటింగ్‌ శాతం నమోదవుతుందా అన్న అనుమానం కల్గుతోంది.