వివాహిత‌ అస‌భ్య‌క‌ర ఫొటోలు సోషల్‌ మీడియాలో, చివ‌రికి

నిర్మ‌ల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనకు సంబంధించిన అసభ్యకరమైన చిత్రాల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్‌ చేశాడని ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది.

వివాహిత‌ అస‌భ్య‌క‌ర ఫొటోలు సోషల్‌ మీడియాలో, చివ‌రికి
suicide

Updated on: Aug 23, 2020 | 3:54 PM

నిర్మ‌ల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనకు సంబంధించిన అసభ్యకరమైన చిత్రాల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్‌ చేశాడని ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన జిల్లాలోని ముధోల్‌లో శనివారం జరిగింది. పురుషోత్తం అనే వ్యక్తి ఓ వివాహితకు చెందిన అశ్లీల చిత్రాల‌ను సోషల్‌ మీడియాలో స‌ర్కులేట్‌ చేశాడు. దీంతో తీవ్ర‌ మనస్తాపానికి గురైన సదరు మహిళ క్రిమిసంహ‌ర‌క‌ మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్ల‌ర్లు చెబుతున్నారు. భర్త ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 

Also Read :

వైఎస్‌ఆర్‌ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల

మ‌ర‌ణంలోనూ వీడ‌ని బంధం : భ‌ర్త మ‌ర‌ణ వార్త విని భార్య మృతి

అలెర్ట్ : ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు

Loading...
Unable to load recommendations.
Follow Us