What’s App Features: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక యూజర్లను కలిగిన మేసెజింగ్ సంస్థ వాట్సాప్. తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ మల్టీ డివైస్ సపోర్ట్‌పై పనిచేసేలా త్వరలో మరో ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వార్తలు వచ్చినా.. ఇంతవరకు ఇది అందరి ఫోన్లలోకి రాలేదు. తాజా సమచారం ప్రకారం.. మీ ఫోన్లో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా వాట్సాప్ వెబ్‌కు కనెక్ట్ అయ్యే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
వినియోగదారుని ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా.. వాట్సప్ వెబ్ సెషన్ ద్వారా ఇంటర్నెట్కు కనెక్ట్ అవ్వచు. ఈ ఫీచర్‌ను ముందుగా wabetainfo గుర్తించింది. దీని ప్రకారం.. వాట్సాప్ వెబ్ ఉపయోగించేటప్పుడు సడెన్‌గా మీ ఫోన్‌కు ఇంటర్నెట్ డిస్ కనెక్ట్ అయితే.. వాట్సాప్ వెబ్ సెషన్ కూడా ఆగిపోతుంది. కానీ త్వరలో వచ్చే ఈ ఫీచర్‌తో వాట్సాప్ వెబ్ ఆగిపోకుండా ఉండనుంది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. ఇక దీంతోపాటు మల్టీ డివైస్ ఫీచర్ ద్వారా ఒకేసారి నాలుగు డివైస్‌లకు కనెక్ట్ చేయవచ్చని wabetainfo తెలిపింది. డెస్క్ టాప్, వెబ్ యాప్, మరో ఫోన్.. ఇలా ఏ డివైస్‌కు అయినా వాట్సాప్ కనెక్ట్ చేస్తే.. అందులోనే చాట్ హిస్టరీ మీరు కనెక్ట్ చేసిన డివైస్లలోకి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఇక వాట్సాప్ లింక్ చేసిన డివైస్‌లలో చాట్లను ఆర్కైవ్ చేయడం, మ్యూట్ చేయడం, డిలీట్ చేయడం వంటివి చేయడానికి కుదరు. ఏ ఫోన్లో అయితే ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేశారో అందులోనే ఇవి చేయడానికి వీలు ఉంటుంది.
Also Read: ల్యాండ్‌లైన్ నెంబర్‌తోనూ ‘వాట్సాప్’ అకౌంట్.. ఇంకా తెలియని ఎన్నో ట్రిక్స్ .. మీరూ లుక్కేయండి.!