Allu Arjun’s ICON: ఐకాన్ ముచ్చ‌టేంది?.. బ‌న్నీ మ‌న‌సులో ఏముంది..? ఛ‌లో తెలుసుకుందాం !

నిన్నంటే బంటుగాడు కానీ.. మొన్న మొన్న ఆ స్టార్ నేమ్‌ మిస్ట‌ర్ డీజే... అదేనండీ దువ్వాడ జ‌గ‌న్నాథం, ఇప్పుడైతే పుష్ప‌....

Allu Arjun's ICON:  ఐకాన్ ముచ్చ‌టేంది?.. బ‌న్నీ మ‌న‌సులో ఏముంది..? ఛ‌లో తెలుసుకుందాం !
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటున్నాడు ఈ స్టైలిష్ స్టార్ నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు
Follow us

|

Updated on: May 04, 2021 | 3:55 PM

నిన్నంటే బంటుగాడు కానీ.. మొన్న మొన్న ఆ స్టార్ నేమ్‌ మిస్ట‌ర్ డీజే… అదేనండీ దువ్వాడ జ‌గ‌న్నాథం, ఇప్పుడైతే పుష్ప‌.. అదేనండీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్‌… మ‌రి రేపు.. ఐకాన్ క‌దా? అంటున్నారా? రేపేంటి? ఇప్ప‌టికే స్టైలిష్ స్టార్ ప్లేస్‌ని ఐకాన్ రీప్లేస్ చేసేసింది. మ‌రి ఇంకా ఐకాన్ ముచ్చ‌టేంది అనుకుంటున్నారా?..తెలుసుకుందాం ప‌దండి.

అద్గ‌దే… బ‌న్నీ కోసం బ్లాక్ బ‌స్ట‌ర్ క‌థ రాసిపెట్టుకుని దానికి ఐకాన్ అని నామ‌క‌ర‌ణం కూడా చేసేసి, రెడీగా ఉన్నారు కెప్టెన్ శ్రీరామ్ వేణు. రెడీ స్ట‌డీ… అని ఆయ‌న కొన్నేళ్లుగా అంటున్నా గో అనే మాట మాత్రం బ‌న్నీ నుంచి ఇంకా రావ‌డం లేదు. అందుకే ఆ గ్యాప్‌లో వ‌కీల్‌సాబ్‌ని కూడా కంప్లీట్ చేసుకున్నారు వేణు శ్రీరామ్‌.

మ‌రి ఇప్పుడైనా ఆ ఛాన్స్ వ‌స్తుందేమో అని అంద‌రూ వెయిటింగ్‌. కానీ ప్లీజ్ వెయిట్ అని అంటున్నారట అల్లువార‌బ్బాయి. వేణు శ్రీరామ్ ఇంకో సారి స్టోరీని ఫైన‌ల్ చేసేలోపు, మురుగ‌దాస్‌తో ఓ సినిమాను కంప్లీట్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట స్టైలిష్ స్టార్‌. మురుగ‌దాస్ స్క్రిప్ట్ వ‌ర్క్ ఇప్ప‌టికే ఫైన‌ల్ అయింద‌ట‌. సో లాంగ్ పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కేస్తుంద‌న్న‌ది ఫిల్మ్ న‌గ‌ర్‌లో హాట్ డిస్క‌ష‌న్‌.

Also Read: ఇళ్లు లేని నిరుపేదలకు ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్.. నిర్మాణం వేగ‌వంతం

‘జ‌యం’ క‌థ‌కు అన్నిచోట్లా విజ‌యాలే.. ఇప్పుడు శాండల్ వుడ్ లో కూడా స‌త్తా చాటుతుందా…