Sehwag Funny Comment : ఆస్ట్రేలియా వెళ్లేందుకు నేను రెడీ.. సెహ్వాగ్ బాబా మళ్లీ పేల్చాడు..

సెహ్వాగ్ బాబా మరో సారి పేల్చాడు... అవసరమైతే ఆఖరి టెస్టులో నేనుంటా నంటూ పంచులతో నవ్వులు పూయించాడు.  భారత జట్టులో వరుస దెబ్బలు..

Sehwag Funny Comment : ఆస్ట్రేలియా వెళ్లేందుకు నేను రెడీ.. సెహ్వాగ్ బాబా మళ్లీ పేల్చాడు..

Updated on: Jan 13, 2021 | 10:04 AM

Virender Sehwag Funny Comment : సెహ్వాగ్ బాబా మరో సారి పేల్చాడు… అవసరమైతే ఆఖరి టెస్టులో నేనుంటా నంటూ పంచులతో నవ్వులు పూయించాడు.  భారత జట్టులో వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆసీస్ పర్యటనకు ఎంపిక నుంచి ఇప్పటివరకు దాదాపు 13 మంది ఆటగాళ్లు గాయపడ్డారు. మూడో టెస్టులో ఏకంగా అయిదుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. సిడ్నీ మైదానంలో రిషభ్ పంత్‌, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రాకు గాయాలైన సంగతి తెలిసిందే.

అయితే వాళ్లలో బుమ్రా, విహారి, జడేజా నాలుగో టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. పంత్‌, అశ్విన్‌ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేదు. దీంతో ఆఖరి టెస్టులో భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందోని క్రికెట్ ప్రియులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా గాయాలపై‌ వీరు‌ ఫన్నీగా ట్వీట్ చేశారు.

బుమ్రా, షమి, ఉమేశ్‌‌, కేఎల్ రాహుల్, జడేజా, విహారి టెస్టు సిరీస్‌కు దూరమయ్యారని తెలుపుతూ సెహ్వాగ్‌ ఓ ఫోటోను పోస్ట్ చేశారు. దానికి.. ‘ఎంతో మంది ఆటగాళ్లు గాయపడ్డారు. అయితే నాలుగో టెస్టుకు 11 మంది లేకపోతే చెప్పండి. జట్టులో చేరడానికి నేను రెడీగా ఉన్నా. క్వారంటైన్‌ నిబంధనలు గురించి తర్వాత ఆలోచిద్దాం’’ అని సరదాగా కామెంట్‌ను జత చేశాడు.

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్ని వ్యంగ్యంగా విశ్లేషిస్తూ సెహ్వాగ్‌ విసిరిన సెటైర్లకు నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇదిలావుంటే, జనవరి 15న బ్రిస్బేన్‌ వేదికగా భారత్‌- ఆసీస్‌ ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.