యూపీ తొలి అడుగు, లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టం, ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ ఆనంది బెన్ పటేల్

వివాదాస్పదమైన లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం చట్టం తెచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆనంది బెన్ పటేల్ జారీ చేశారు.

యూపీ తొలి అడుగు, లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టం, ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ ఆనంది బెన్ పటేల్

వివాదాస్పదమైన లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం చట్టం తెచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆనంది బెన్ పటేల్ జారీ చేశారు. చట్టంగా ఇది శనివారం నుంచే అమలులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ‘యూపీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్ లా ఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజన్ ఆర్డినెన్స్-2020’గా దీన్ని వ్యవహరిస్తున్నారు. లవ్ జిహాద్ కు అడ్డుకట్ట వేసేందుకు, బలవంతపు మతమార్పిడిని నివారించేందుకు ఈ కొత్త చట్టం దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇంతకు మునుపే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ ను రూపొందించింది.

చట్ట వ్యతిరేకమైన మత మార్పిడిలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తేవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి సిధ్ధార్త్ నాథ్ సింగ్ తెలిపారు. మైనర్ బాలికలను, ఎస్సీ, ఎస్టీ యువతులను మభ్యపెట్టి పెళ్లి చేసుకుని బలవంతంగా మత మార్పిడి చేస్తే ఇందుకు కారకులైనవారికి మూడేళ్ళ నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధించనున్నారు. సామూహిక మత మార్పిడుల విషయంలో ఇంతే జైలుశిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధిస్తారు. ఈ చట్టం కింద..ఇక ఇలా జరిగే ఏ పెళ్ళినైనా చెల్లనిదిగా ప్రకటిస్తారు. అయితే వివాహం తరువాత మతం మార్చుకోగోరేవారు జిల్లా మేజిస్ట్రేట్ కి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.దేశంలో లవ్ జిహాద్ కి వ్యతిరేకంగా చట్టం తెచ్చిన మొదటి  రాష్ట్రం యూపీయే అయింది. ఇప్పటికే పలు సంస్థలు, సంఘాలు ఇలాంటి చట్టం అవసరమని డిమాండ్ చేస్తున్నాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu