ఇక కాలేజీల్లో మూగబోనున్న మొబైల్ ఫోన్లు! 

ఇక కాలేజీల్లో మూగబోనున్న మొబైల్ ఫోన్లు! 

ఆధునిక ప్రపంచంలో యువత స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ గురువారం సర్క్యులర్‌ జారీచేసింది. క్లాస్‌లు జరుగుతున్న సమయంలో చాలా మంది విద్యార్థులు మొబైల్‌ ఫోన్లపై దృష్టి పెట్టి.. అధ్యాపకులు చెప్పే విషయాలను పట్టించుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేవలం విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందనకుంటే పొరపాటే. వారితో పాటు విశ్వవిద్యాలయాలు, […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 18, 2019 | 6:06 PM

ఆధునిక ప్రపంచంలో యువత స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ గురువారం సర్క్యులర్‌ జారీచేసింది. క్లాస్‌లు జరుగుతున్న సమయంలో చాలా మంది విద్యార్థులు మొబైల్‌ ఫోన్లపై దృష్టి పెట్టి.. అధ్యాపకులు చెప్పే విషయాలను పట్టించుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేవలం విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందనకుంటే పొరపాటే. వారితో పాటు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని బోధనా సిబ్బందికి కూడా ఈ నిషేధం వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు తమ విలువైన సమయాన్ని ఎక్కువగా మొబైల్‌ ఫోన్ల వాడకానికి కేటాయిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu