Serum Vaccine: సీరం ఇన్‌స్టిట్యూట్‌ అగ్ని ప్రమాదంపై స్పందించిన ఐక్యరాజ్యసమితి… తీవ్ర విచారకరమంటూ…

UN Reaction On Serum Fire Accident: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. టెర్మినల్ 1 గేట్ వద్ద ఉన్న బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు...

Serum Vaccine: సీరం ఇన్‌స్టిట్యూట్‌ అగ్ని ప్రమాదంపై స్పందించిన ఐక్యరాజ్యసమితి... తీవ్ర విచారకరమంటూ...
Follow us

|

Updated on: Jan 22, 2021 | 2:45 PM

UN Reaction On Serum Fire Accident: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. టెర్మినల్ 1 గేట్ వద్ద ఉన్న బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం తీవ్ర విచారకరమని.. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుందని ఐరాస చీఫ్‌ ఆశాభావం వ్యక్తం చేసినట్లు సెక్రటరీ జనరల్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం వల్ల వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం ఉండదని సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా స్ఫస్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన అధికారులు.. సీరం ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతోన్న వెల్డింగ్‌ పనులే ప్రమాదానికి కారణమని ఓ అంచనాకు వచ్చారు.

Also Read: మృతులకు పరిహారం ప్రకటించిన సీరమ్ సంస్థ.. ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని..