మా మనసంతా నువ్వే.. “ఉదయ కిరణాలు”

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకుల నుంచి మంచి పేరును సొంతం చేసుకున్న కొందరిలో అందరివాడు.. మా మనసంతా నువ్వే.. అంటూ నిలిచిపోయినవాడు.. ఉదయ్ కిరణ్.

మా మనసంతా నువ్వే.. ఉదయ కిరణాలు
Follow us

|

Updated on: Jun 27, 2020 | 6:17 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకుల నుంచి మంచి పేరును సొంతం చేసుకున్న కొందరిలో అందరివాడు.. మా మనసంతా నువ్వే.. అంటూ నిలిచిపోయినవాడు.. ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు.

ఎలాంటి వారసత్వం లేకుండానే తెలుగు చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన ఏకైక కథనాయకుడు ఉదయ్ కిరణ్. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే పెద్ద స్టార్‌డమ్‌.. ఆఫర్లు క్యూ కట్టాయి.. విజయాలు అతడి ముంగిట నిలిచాయి. అవార్డులు వరుస కట్టాయి. ‘హ్యాట్రిక్‌ హీరో’ అనే ట్రెండ్‌కు పురుడుపోసుకుంది ఉదయ్ కిరణ్ ను చూసిన తర్వాతే.

చిన్న వయసులోనే అసాధ్యం అనుకున్న ఎన్నో రికార్డులను తన పేరుతో లిఖించుకున్నాడు. కమల్‌హాసన్‌ తర్వాత అతిచిన్న వయసులో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న తెలుగు హీరోగా గుర్తింపు పొందాడు. కానీ ఎవరూ ఊహించని విధంగా తనువు చాలించాడు. కలుసు కోవాలని… చిత్రం… ఔనన్నా కాదన్నా.. మనసంతా నువ్వే.. గుండె ఝల్లుమంది… వంటి ఎన్నో అద్బుతమైన చిత్రాలు అతని సొంతం.

ఉదయ్‌ కిరణ్‌ 40వ జయంతిని ఫిల్మ్‌ ఇండస్ట్రీ మర్చిపోయినా.. ఎవరు తలచుకున్నా… తలచుకోకున్నా.. అభిమానులు తమ గుండెల నిండా తమ అభిమాన హీరోను ఒక్కసారిగా గుర్తుచేసుకుంటూ శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.