బ్రేకింగ్.. సమ్మె విరమించిన ఆర్టీసీ ఉద్యోగి..

ఆర్టీసీ సమ్మెపై శనివారం కేబినెట్ మీటింగ్ అనంతరం.. సీఎం కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. అయితే మంత్రివర్గ సమావేశం అనంతరం.. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులనుద్దేశించి పలు సూచనలు చేశారు. నవంబర్ 5వ తేదీ వరకు విధుల్లో చేరాలంటూ విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల నేతల మాటలు విని మీ ఉద్యోగాలు కోల్పోవద్దంటూ సూచించారు. డెడ్‌లైన్‌లోపు ఉద్యోగులు చేరిన వారందరి భద్రత తాను చూసుకుంటానని.. అప్పుడు కూడా చేరకపోతే.. మీ ఉద్యోగాలు మీరు కోల్పోయినట్లేనంటూ హెచ్చరించారు. ఈ […]

బ్రేకింగ్.. సమ్మె విరమించిన ఆర్టీసీ ఉద్యోగి..
Follow us

| Edited By:

Updated on: Nov 03, 2019 | 1:32 PM

ఆర్టీసీ సమ్మెపై శనివారం కేబినెట్ మీటింగ్ అనంతరం.. సీఎం కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. అయితే మంత్రివర్గ సమావేశం అనంతరం.. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులనుద్దేశించి పలు సూచనలు చేశారు. నవంబర్ 5వ తేదీ వరకు విధుల్లో చేరాలంటూ విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల నేతల మాటలు విని మీ ఉద్యోగాలు కోల్పోవద్దంటూ సూచించారు. డెడ్‌లైన్‌లోపు ఉద్యోగులు చేరిన వారందరి భద్రత తాను చూసుకుంటానని.. అప్పుడు కూడా చేరకపోతే.. మీ ఉద్యోగాలు మీరు కోల్పోయినట్లేనంటూ హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ డెడ్‌లైన్‌‌కు ముందే ఓ ఆర్టీసీ ఉద్యోగి తిరిగి విధుల్లో చేరాడు. ఉప్పల్‌ డిపోలో అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న కేశవ కృష్ణ.. తిరిగి విధుల్లో చేరుతున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేశవ కృష్ణ.. ఆదివారం డిపో మేనేజర్‌కు ఓ లేఖ అందజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సూచన మేరకు తాను సమ్మె విరమించి బేషరతుగా విధుల్లో చేరుతున్నట్టు పేర్కొన్నారు.

కాగా, సీఎం కేసీఆర్‌ ప్రకటించిన డెడ్‌లైన్‌ తర్వాత.. ఆర్టీసీ ఉద్యోగుల్లో మార్పులు మొదలయ్యాయి. పలువురు కార్మికులు ఉద్యోగుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అయితే సీఎం కేసీఆర్ పిలుపుతో.. సమ్మె విరమించి విధుల్లో చేరిన తొలి వ్యక్తిగా కృష్ణ నిలిచారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై.. ఆర్టీసీ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగం తీసేసే అధికారం సీఎం కేసీఆర్‌కు లేదన్నారు.

Latest Articles
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా