తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. చివరి విడత కౌన్సెలింగ్‌ ఎప్పుడో తెలుసా..

ఎంసెట్‌ ఫార్మసీ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఎంసెట్‌ బైపీసీ అభ్యర్థులకు బీ ఫార్మసీ, ఫార్మా డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ ఖరారైంది..

తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. చివరి విడత కౌన్సెలింగ్‌ ఎప్పుడో తెలుసా..

Updated on: Nov 14, 2020 | 3:10 AM

TS Pharmacy Counselling : ఎంసెట్‌ ఫార్మసీ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఎంసెట్‌ బైపీసీ అభ్యర్థులకు బీ ఫార్మసీ, ఫార్మా డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 19 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 19 నుంచి 21 వరకు బుకింగ్‌ నమోదు చేసుకోవాలి. ఈ నెల 20, 21న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్లకు గడు ఇచ్చారు. ఈ నెల 24న ఫార్మసీ సీట్ల కేటాయింపు జరగనుంది.

అదేవిధంగా చివరి విడత ధ్రువపత్రాల పరిశీలన కోసం డిసెంబరు 1న స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. డిసెంబర్‌ 2న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. డిసెంబరు 2, 3 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు గడువు ఇచ్చారు. డిసెంబరు 5న అభ్యర్థులకు ఫార్మసీ సీట్ల కేటాయింపు జరగనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us