హైదరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీనే అండ, కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కులేదు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

టీఆర్ఎస్ దండయాత్ర గాంధీనగర్ నుంచే ప్రారంభమవుతుందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. వరద బాధితులను జాతీయ పార్టీలు పట్టించుకోలేదన్న ఆమె, ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీలకు లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆమె చెప్పారు. కరోనా సమయంలో, వరదల సమయంలో హైదరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీనే అండగా ఉందన్నారామె. వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తుంటే… బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సంఘానికి […]

హైదరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీనే అండ, కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కులేదు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత
Follow us

|

Updated on: Nov 19, 2020 | 4:52 PM

టీఆర్ఎస్ దండయాత్ర గాంధీనగర్ నుంచే ప్రారంభమవుతుందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. వరద బాధితులను జాతీయ పార్టీలు పట్టించుకోలేదన్న ఆమె, ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీలకు లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆమె చెప్పారు. కరోనా సమయంలో, వరదల సమయంలో హైదరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీనే అండగా ఉందన్నారామె. వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తుంటే… బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయని తప్పుబట్టారు. ప్రజల నోటిదగ్గర ముద్దను లాక్కున్నారని విమర్శించారు. హైదరాబాద్ వరద బాధితులకు కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అండగా నిలించిందని చెప్పారు. గాంధీనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి అబిడ్స్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ వేయడానికి ముందు గాంధీనగర్ లోని లక్ష్మీగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కవిత వెంట టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మనరేశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.