హిజ్రాలపై యూపీ పోలీసుల లాఠీ

ఉత్తరప్రదేశ్‌ మీరట్ సమీపంలో పోలీసులు ట్రాన్స్ జెండర్లపై లాఠీ ఝులిపించారు. ఈ ఘటన మీరట్ లోని లాల్ కుర్తీ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగింది. పోలీసుల దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుంచి కొందరు హిజ్రాలు పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాల్‌కుర్తీ పీఎస్ పరిధిలో.. హిజ్రాలంతా కలిసి తాము సేకరించిన డబ్బులను పంచుకునే నేపథ్యంలో చిన్న గొడవ జరిగింది. ఈ క్రమంలో వారంతా రెండు వర్గాలుగా చీలిపోయి కొట్లాటకు […]

హిజ్రాలపై యూపీ పోలీసుల లాఠీ
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2019 | 11:23 AM

ఉత్తరప్రదేశ్‌ మీరట్ సమీపంలో పోలీసులు ట్రాన్స్ జెండర్లపై లాఠీ ఝులిపించారు. ఈ ఘటన మీరట్ లోని లాల్ కుర్తీ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగింది. పోలీసుల దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుంచి కొందరు హిజ్రాలు పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లాల్‌కుర్తీ పీఎస్ పరిధిలో.. హిజ్రాలంతా కలిసి తాము సేకరించిన డబ్బులను పంచుకునే నేపథ్యంలో చిన్న గొడవ జరిగింది. ఈ క్రమంలో వారంతా రెండు వర్గాలుగా చీలిపోయి కొట్లాటకు దిగారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ రెండు వర్గాల వారి వాంగ్మూలాన్ని తీసుకునేందుకు స్టేషన్‌కు రప్పించారు. ఈ క్రమంలో అక్కడ మరోసారి వారి మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అక్కడే అసభ్యంగా ప్రవర్తించడంతో.. లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని ఓ అధికారి తెలిపారు.

అయితే పోలీసుల తీరుపై నిరసనలు వెల్లువెత్తడంతో.. ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామని, వారిని అదుపు చేయడానికి అవసరమైన బలగాలకంటే ఎక్కువ మందిని వినియోగించినట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రత్యేక ఎస్పీ నితిన్‌ తివారీ స్పష్టం చేశారు.