టాక్సిక్ ఆసిడ్స్ ప్రభావంతో సికింద్రాబాద్ జీవనం నరకం!

కాప్రా, హుస్సేన్ సాగర్ చెరువులు మురుగునీటితో నిండిపోయాయి. కాప్రా చెరువులోకి ఎగువ ప్రాంతంలోని మురుగు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనలతో  జలాలు విషపూరితంగా మారుతున్నాయి. కాప్రా, నాగారం ప్రాంతంలోని మురుగునీరు, చర్లపల్లి, కుషాయిగూడ పారిశ్రామికవాడల్లోని రసాయనాలు ఈ చెరువులోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ చెరువు పూర్తిగా కలుషితమైంది. చెరువులోని నీటిని చేతితో తాకలేని పరిస్థితి. చెరువు పరిసర ప్రాంతంలోకి ప్రవేశించగానే ముక్కు పుటాలు అదిరేంత దుర్వాసన వెలువడుతోంది. ఈ చెరువు నిరంతరం మురుగునీటితో నిండి ఉంటుంది. […]

టాక్సిక్ ఆసిడ్స్ ప్రభావంతో సికింద్రాబాద్ జీవనం నరకం!
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2019 | 5:45 PM

కాప్రా, హుస్సేన్ సాగర్ చెరువులు మురుగునీటితో నిండిపోయాయి. కాప్రా చెరువులోకి ఎగువ ప్రాంతంలోని మురుగు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనలతో  జలాలు విషపూరితంగా మారుతున్నాయి. కాప్రా, నాగారం ప్రాంతంలోని మురుగునీరు, చర్లపల్లి, కుషాయిగూడ పారిశ్రామికవాడల్లోని రసాయనాలు ఈ చెరువులోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ చెరువు పూర్తిగా కలుషితమైంది. చెరువులోని నీటిని చేతితో తాకలేని పరిస్థితి. చెరువు పరిసర ప్రాంతంలోకి ప్రవేశించగానే ముక్కు పుటాలు అదిరేంత దుర్వాసన వెలువడుతోంది. ఈ చెరువు నిరంతరం మురుగునీటితో నిండి ఉంటుంది. ఒకప్పుడు తాగునీరు అందించిన చెరువు నీరు నలుపు రంగులోకి మారింది. ఆ నీటిని మూగ జీవాలు తాగినా మృతి చెందే పరిస్థితి నెలకొంది. చెరువంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉంది.

వర్షాకాలం వస్తే చాలు కీసర మండలంలోని 10 గ్రామాల ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడాల్సిందే. చెరువులోని నీరంతా కూడా కాలనీల్లో చేరడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. చెరువులన్నీ కలుషితం కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజలు కోరుతున్నారు. దీనికి తోడు దోమల బెదడ అధికమైంది. దోమల ప్రభావంతో చెరువు సమీప ప్రాంత ప్రజలు తరచూ అంటు వ్యాధుల బారిన పడుతున్నారు. చెరువులోకి మురుగునీరు రాకుండా ప్రత్యేక పైపులైను ఏర్పాటు చేయాలి. చెరువులోకి కేవలం వర్షపు నీరు వచ్చి చేరేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరుతో పాటు పెద్ద మొత్తంలో చెత్తా చెదారం వచ్చి చేరుతోంది. తీరంలోనే పేరుకుపోయిన చెత్తా చెదారం కుళ్లిపోయి ఎండా కాలంలో భరించలేని దుర్వాసన వస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా అక్కడ చేపట్టిన చర్యలు శూన్యం. ముఖ్యంగా వేసవిలో సెలవులు ఉండడంతో నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలోనే సందర్శకులు కుటుంబాలతో సహా ఇక్కడికి విచ్చేస్తుంటారు. సందర్శకుల తాకిడితో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా, పర్యాటకులకు హాయిగా ఉండేలా ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు.

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో