‘లాక్ డౌన్ భయం’, దేశం వదిలి వెళ్తున్న బ్రిటిషర్లు

కరోనా వైరస్ మహమ్మారి మళ్ళీ విజృంభించడంతో బ్రిటన్ లో గురువారం నుంచి నెలరోజులపాటు లాక్ డౌన్ విధించాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇంగ్లండ్ సహా వివిధ ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో బ్రిటీషర్ల రద్దీ పెరిగిపోతోంది.  నెల రోజుల లాక్ డౌన్ అంటే మళ్ళీ తమకు కష్టాలు తప్పవని భయపడుతున్న ప్రజలు దేశం వదిలి వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే దేశం బయట ఉన్న బ్రిటిష్ వారిని ఇప్పట్లో ఇక్కడికి రావద్దని అధికారులు సూచించారు. బుధవారం సాయంత్రం వరకు […]

'లాక్ డౌన్ భయం', దేశం వదిలి వెళ్తున్న బ్రిటిషర్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 02, 2020 | 7:58 PM

కరోనా వైరస్ మహమ్మారి మళ్ళీ విజృంభించడంతో బ్రిటన్ లో గురువారం నుంచి నెలరోజులపాటు లాక్ డౌన్ విధించాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇంగ్లండ్ సహా వివిధ ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో బ్రిటీషర్ల రద్దీ పెరిగిపోతోంది.  నెల రోజుల లాక్ డౌన్ అంటే మళ్ళీ తమకు కష్టాలు తప్పవని భయపడుతున్న ప్రజలు దేశం వదిలి వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే దేశం బయట ఉన్న బ్రిటిష్ వారిని ఇప్పట్లో ఇక్కడికి రావద్దని అధికారులు సూచించారు. బుధవారం సాయంత్రం వరకు తాము నార్మల్ గా విమాన సర్వీసులు నిర్వహిస్తామని, ఆ తరువాత విషయం చెప్పలేమని దేశంలోని పలు ఎయిర్ లైన్స్ ప్రకటించాయి. దీంతో  ముఖ్యంగా ఇంగ్లండ్ వాసులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయాలకు చేరుకుంటున్నారు. నెల రోజుల తరువాతే, లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాతే మళ్ళీ స్వదేశం వస్తామని చాలామంది చెబుతున్నారు.