“కరోనాతో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధం లేదు..బెండు తీస్తాం”

కరోనా వైరస్ (కోవిడ్‌-19) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ మహమ్మారి వైరస్..ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, అన్ని దేశాలకు విస్తరిస్తోంది. అయితే దీని గురించి అపోహలు, వదంతులు కూడా ఎక్కువయ్యాయి. జనం భయంతో బిక్కబిక్కుమంటున్నారు. మరోవైపు కరోనా ఎఫెక్ట్‌తో  హైదరాబాద్‌లో  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిలిపి వేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ వదంతులపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ స్పందించారు.  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ స్పెషల్‌ డ్రైవ్స్‌లో ఎటువంటి మార్పులు లేవని, యథావిధిగానే […]

కరోనాతో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధం లేదు..బెండు తీస్తాం
Follow us

|

Updated on: Mar 04, 2020 | 4:16 PM

కరోనా వైరస్ (కోవిడ్‌-19) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ మహమ్మారి వైరస్..ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, అన్ని దేశాలకు విస్తరిస్తోంది. అయితే దీని గురించి అపోహలు, వదంతులు కూడా ఎక్కువయ్యాయి. జనం భయంతో బిక్కబిక్కుమంటున్నారు. మరోవైపు కరోనా ఎఫెక్ట్‌తో  హైదరాబాద్‌లో  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిలిపి వేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఈ వదంతులపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ స్పందించారు.  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ స్పెషల్‌ డ్రైవ్స్‌లో ఎటువంటి మార్పులు లేవని, యథావిధిగానే చెకింగ్స్ కొనసాగుతాయని తెలిపారు. చెకింగ్స్‌లో చేసేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఒక్కొక్కరికి ఒక్కో స్ట్రా(పుల్ల) ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చర్యలుంటాయని అంజనీ కుమార్‌ పేర్కొన్నారు.

Latest Articles