పట్టువీడేదీ లేదంటున్న రైతు సంఘాలు.. బెట్టు చేయడం సరికాదంటోంది కేంద్రం.. 10వ విడత చర్చలు షురూ..!

ఇవాళ మరోసారి రైతుల సంఘాల నాయ‌కులు, ప్రభుత్వం మ‌ధ్య 10వ విడత చ‌ర్చలు మొదలయ్యాయి.

పట్టువీడేదీ లేదంటున్న రైతు సంఘాలు.. బెట్టు చేయడం సరికాదంటోంది కేంద్రం.. 10వ విడత చర్చలు షురూ..!
Follow us

|

Updated on: Jan 20, 2021 | 4:04 PM

farmers and Government 10th round talks: కేంద్ర సాగు చట్టాలపై రైతులతో సర్కార్ చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇవాళ మరోసారి రైతుల సంఘాల నాయ‌కులు, ప్రభుత్వం మ‌ధ్య 10వ విడత చ‌ర్చలు మొదలయ్యాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భ‌వన్‌లో సమావేశమైన రెండు పక్షాలు కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీకి రైతుల త‌ర‌ఫున వివిధ సంఘాల నేత‌లు హాజ‌రు కాగా, ప్రభుత్వం త‌రపున కేంద్ర వ్యవ‌సాయశాఖ మంత్రి ‌న‌రేంద్ర‌సింగ్ తోమర్‌, కేంద్ర ఆహార పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ చ‌ర్చల్లో పాల్గొన్నారు. కాగా ప్రభుత్వం, రైతుల సంఘాల విరుద్ధ ప్రకట‌న‌ల‌ను చూస్తే.. ఈ దఫా కూడా ముందడుగుపడే పరిస్థితి కనిపించడంలేదు.

వివాదాస్పద వ్యవసాయ చ‌ట్టాల‌ను రద్దు చేయాలంటూ రైతు సంఘాల ఆందోళన దాదాపు రెండు నెలలుగా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించే వరకు త‌మ ఆందోళ‌నను విర‌మించే ప్రస‌క్తేలేద‌ని రైతు సంఘాల నాయ‌కులు భీష్మించి కూర్చున్నారు. స‌వ‌ర‌ణ‌ల‌కు ఒప్పుకుంటాం త‌ప్ప చ‌ట్టాల‌ను పూర్తిగా ర‌ద్దుచేసే అవ‌కాశం లేద‌ని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. ఈ నేప‌థ్యంలో ఇవాళ 10వ విడ‌త చ‌ర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. దీంతో మరోసారి ఇరుపక్షాలు సమావేశమయ్యారు.