ఆర్టీసీపై ఎస్మా?… కేసీఅర్ మనసులో ఏముంది?

తెలంగాణ సీఎం కేసీఆర్ కు నిజంగానే ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయినట్టుగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె… దానికి మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్ డౌన్ యోచన… వెరసి కేసీఆర్ కు డబుల్ ట్రబుల్ తప్పేలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు కేసీఆర్ కాస్తంత కఠినంగానే వ్యవహరిస్తున్న దాఖలాలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ఘీంకరింపులకు ఆర్టీసీ కార్మికులు […]

ఆర్టీసీపై ఎస్మా?... కేసీఅర్ మనసులో ఏముంది?
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2019 | 3:53 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ కు నిజంగానే ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయినట్టుగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె… దానికి మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్ డౌన్ యోచన… వెరసి కేసీఆర్ కు డబుల్ ట్రబుల్ తప్పేలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు కేసీఆర్ కాస్తంత కఠినంగానే వ్యవహరిస్తున్న దాఖలాలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ఘీంకరింపులకు ఆర్టీసీ కార్మికులు ఎంతమాత్రం బెదరడం లేదు. ఎస్మా ప్రయోగించినా సమ్మె విరమించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలో పండగలోగా సమ్మె ముగిసిపోతే ఫరవాలేదు గానీ.. పండగ తర్వాత కూడా సమ్మె కొనసాగితే… ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కనీసం పెన్ డౌన్ అయినా చేయాల్సిందేనన్న భావనకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వచ్చినట్లుగా వినిపిస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

అది 2003  లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులని ఒక్క కలం పోటుతో తీసి పారేశారు. ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణ ఆర్టీసీ కార్మిక ఉద్యోగులకు రానుందా ? ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించే హక్కు ఎవరికీ ఉంది? అదే ఎస్మా ….. అత్యవసర సేవల నిర్వహణ చట్టం. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా జీవనానికి అంతరాయం కలగకుండా ఉండడం కోసం ఈ చట్టం ఉంది. ఎస్మా ప్రకారం సమ్మెకు పోతే ఉద్యోగాలు పోవడం ఖాయం. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు పోరాడుతున్నాయు.

దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించుకోవాలని  హెచ్చరిస్తూ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం చేస్తూ ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. సమ్మెను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం దానిని అణిచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీలో పనిచేసే కార్మికులందరూ పబ్లిక్ సర్వెంట్లే. చట్టంలోని ఓ సెక్షన్ ఇదే విషయం చెబుతోంది. గతంలో తమిళనాడులో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు సమ్మెకు వెళ్లినపుడు నిర్దాక్షిణ్యంగా ఎస్మా ప్రయోగించి దాదాపుగా లక్ష మందిని  ఉద్యోగాల నుంచి తొలగించారు.అలా  ప్రజాగ్రహానికి గురైన జయలలిత తరువాతి ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ఇప్పుడు జయలలిత బాటలో పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్టీసీ కార్మికులు తమ విధులను బహిష్కరించిన నేపథ్యంలో ప్రజా జీవనానికి అంతరాయం కలుగుతుంది కాబట్టి ఎస్మా ను ప్రయోగించాలి అనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.  కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి గులాబీ బాస్ కేసీఆర్ అసలు ఏ మాత్రం చొరవ చూపలేదు అని తాజా హస్తిన పర్యటన చేస్తున్న ఆయన తీరును చెప్పకనే చెబుతుంది. ఇక అలాంటి సమయంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు కేసీఆర్ ఎప్పుడో సమస్యలు పరిష్కరిస్తారు అంటే నమ్మే స్థితిలో లేరు.

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి కేసీఆర్ ఇప్పుడు చొరవ తీసుకోవాలి అనేదే కార్మికుల ఆలోచన. కానీ కార్మికుల ఆందోళన అణచివేసే ప్రయత్నం చేస్తూ ఎస్మా ప్రయోగించే ఆలోచనలో ఉన్నారు కెసిఆర్. ఒకవేళ అదే గనుక జరిగితే ఆందోళన మరింత ఉధృతమవుతోందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Latest Articles
మట్టిలో పాతిపెట్టిన చిన్న కుండ.. దొరికిన పురాతన నిధి..
మట్టిలో పాతిపెట్టిన చిన్న కుండ.. దొరికిన పురాతన నిధి..
రొమాంటిక్ సీన్ తర్వాత ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి.. హీరోయిన్..
రొమాంటిక్ సీన్ తర్వాత ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి.. హీరోయిన్..
ఛీ.. ఇదేం వంటకం! స్పెషల్‌ డిష్‌ పేరిట రెస్టారెంట్‌ నిర్వాకం..
ఛీ.. ఇదేం వంటకం! స్పెషల్‌ డిష్‌ పేరిట రెస్టారెంట్‌ నిర్వాకం..
వచ్చిన ఆదాయం వచ్చినట్లే పోతుందా.? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే..
వచ్చిన ఆదాయం వచ్చినట్లే పోతుందా.? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే..
అక్షయ తృతీయ రోజున మొగిలయ్యకు సాయం చేసిన జగతి మేడమ్..వీడియో
అక్షయ తృతీయ రోజున మొగిలయ్యకు సాయం చేసిన జగతి మేడమ్..వీడియో
బెల్లం తింటే ఇన్ని రోగాలు తగ్గుతాయా.. మిరాకల్ అంతే!
బెల్లం తింటే ఇన్ని రోగాలు తగ్గుతాయా.. మిరాకల్ అంతే!
మరో 3 రోజులు చల్లదనమే! ఈ ప్రాంతాలకు పిడుగులు పడే అవకాశం..
మరో 3 రోజులు చల్లదనమే! ఈ ప్రాంతాలకు పిడుగులు పడే అవకాశం..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
ఎల్బీ స్టేడియం సభలో ప్రసంగంతో ఉర్రూతలూగించిన ప్రధాని మోదీ..
ఎల్బీ స్టేడియం సభలో ప్రసంగంతో ఉర్రూతలూగించిన ప్రధాని మోదీ..
గుజరాత్‌తో మ్యాచ్..టాస్ గెలిచిన CSK.. విధ్వంసకర ప్లేయర్ వచ్చేశాడు
గుజరాత్‌తో మ్యాచ్..టాస్ గెలిచిన CSK.. విధ్వంసకర ప్లేయర్ వచ్చేశాడు
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట