నరసింహన్‌కు కీలక పదవి ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్?

తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లలను ప్రకటించిన కేంద్రం.. తెలంగాణలో నరసింహన్‌కి ఉద్వాసన పలికి తమిళనాడుకి చెందిన తమిళిసై సౌందర రాజన్‌‌కు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో  ప్రస్తుత గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ కలిశారు. 9 ఏళ్ల 9 నెలలుగా ఆయన గవర్నర్ పదవిలో ఉన్నారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించినందుకు నరసింహన్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం. కాగా, నరసింహన్ సుదీర్ఘ కాలం గవర్నర్‌గా […]

నరసింహన్‌కు కీలక పదవి ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్?
5 new governors appointed, Kalraj Mishra goes to Rajasthan, Tamil Nadu BJP chief is Telangana governor
Follow us

|

Updated on: Sep 01, 2019 | 6:59 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లలను ప్రకటించిన కేంద్రం.. తెలంగాణలో నరసింహన్‌కి ఉద్వాసన పలికి తమిళనాడుకి చెందిన తమిళిసై సౌందర రాజన్‌‌కు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో  ప్రస్తుత గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ కలిశారు. 9 ఏళ్ల 9 నెలలుగా ఆయన గవర్నర్ పదవిలో ఉన్నారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించినందుకు నరసింహన్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం. కాగా, నరసింహన్ సుదీర్ఘ కాలం గవర్నర్‌గా పని చేసిన అనుభవంతో పాటు రాష్ట్రంపై పూర్తి పట్టు ఉండటంతో  ఆయన సేవలను కేసీఆర్ వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయన్ను నియమించే అవకాశముంది. గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేసిన తర్వాత సలహాదారుగా ప్రకటిస్తారని సమాచారం. ఇప్పటికే రిటైర్డ్ సీఎస్‌, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వ సలహాదారులుగా కేసీఆర్ నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో నరసింహన్‌ను కూడా ప్రభుత్వ సలహదారుగా నియమిస్తారని తెలుస్తోంది.