కరాటే కిడ్, గట్టివాడే ! ఏడుస్తూనే ‘పలక’ పగలగొట్టాడు !

ఫ్లోరిడాలో కరాటే నేర్చుకుంటున్న పిల్ల గడుగ్గాయిల్లో ఫోనిక్స్ అనే 5 ఏళ్ళ చిన్న కుర్రాడు కూడా ఉన్నాడు. భూమికి జానెడంత ఎత్తులేని వీడు శిక్షణలో భాగంగా కరాటే బోర్డు (పలక)ను కాలితో పగులగొట్టలేక నానా అవస్థా పడ్డాడు. ఒక దశలో సాధ్యం కాక బిక్క ముఖం వేసి దాదాపు వెక్కివెక్కి ఏడ్చినంత పని చేశాడు. కానీ ట్రైనర్ వాడిని ఎంకరేజ్ చేయడంతో చివరకు ఆ పలకను రెండు ముక్కలు చేయగలిగాడు.  అందరిచేతా శభాష్ అనిపించుకున్నాడు. హాలీవుడ్ నటుడు […]

కరాటే కిడ్, గట్టివాడే ! ఏడుస్తూనే పలక పగలగొట్టాడు !

Edited By:

Updated on: Nov 03, 2020 | 4:07 PM

ఫ్లోరిడాలో కరాటే నేర్చుకుంటున్న పిల్ల గడుగ్గాయిల్లో ఫోనిక్స్ అనే 5 ఏళ్ళ చిన్న కుర్రాడు కూడా ఉన్నాడు. భూమికి జానెడంత ఎత్తులేని వీడు శిక్షణలో భాగంగా కరాటే బోర్డు (పలక)ను కాలితో పగులగొట్టలేక నానా అవస్థా పడ్డాడు. ఒక దశలో సాధ్యం కాక బిక్క ముఖం వేసి దాదాపు వెక్కివెక్కి ఏడ్చినంత పని చేశాడు. కానీ ట్రైనర్ వాడిని ఎంకరేజ్ చేయడంతో చివరకు ఆ పలకను రెండు ముక్కలు చేయగలిగాడు.  అందరిచేతా శభాష్ అనిపించుకున్నాడు. హాలీవుడ్ నటుడు డ్వాన్ జాన్సన్ ఈ లిటిల్ బాయ్ వీడియోను షేర్ చేయగా కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.  ప్రశంసల కైతే లెక్కే లేదు !

Follow Us