పబ్‌లో జరిగిన దాడిపై రాహుల్ తల్లి ఏమన్నారంటే!

ఈ ఘటనపై తాజాగా రాహుల్ తల్లి స్పందించారు. బుధవారం రోజు సాయంత్రమే రాహుల్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. రాత్రి ఇంటికి రాలేదని రాహుల్ తల్లి..

పబ్‌లో జరిగిన దాడిపై రాహుల్ తల్లి ఏమన్నారంటే!
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2020 | 4:02 PM

బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై ఓ పబ్లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 4వ తేదీ బుధవారం రాత్రి రాహుల్ సిప్లిగంజ్ కొంతమంది స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కి వెళ్లగా అక్కడ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడు రాహుల్ సిప్లిగంజ్‌పై బీర్ బాటిల్స్‌తో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో సింగర్ రాహుల్‌కి తీవ్ర రక్తస్రావం కావడంతో.. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా.. అనంతరం ఈ గొడవపై రాహుల్ స్పందించాడు. తనతో వచ్చిన అమ్మాయి పట్ల వారు అనుచితంగా ప్రవర్తించడం వల్లనే గొడవ మొదలైందని తెలిపాడు.

అలాగే.. ఈ విషయాన్ని తెలుపుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా ట్వీట్ చేసి.. దీనిపై స్పందించాలని కోరాడు. మీకు నేను ఓటు వేసి గెలిపించానని.. పబ్‌లో జరిగిన దాడిలో బాధ్యులను శిక్షించాలని రాహుల్ కేటీఆర్‌ని కోరారు. అలాగే తనదేమైనా తప్పుంటే శిక్షించమని అర్థించాడు. ఈ దాడిలో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేశ్ రెడ్డి బ్యాచ్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ దాడిలో తన సోదరుడు లేడని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెబుతున్నారు.

అయితే ఈ ఘటనపై తాజాగా రాహుల్ తల్లి స్పందించారు. బుధవారం రోజు సాయంత్రమే రాహుల్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. రాత్రి ఇంటికి రాలేదని రాహుల్ తల్లి తెలిపారు. అయితే పబ్‌లో రాహుల్‌పై దాడి జరిగినట్టు టీవీలో చూసేంత వరకూ తెలియదని ఆమె అన్నారు. ఉదయాన్నే ఈ విషయం తెలియడంతో ఆస్పత్రికి వెళ్లి రాహుల్‌ని చూసినట్టు ఆవిడ చెప్పారు.