Shubman Gill’s family: రైతుల ఉద్యమానికి శుబమన్‌ గిల్‌ కుటుంబసభ్యుల మద్దతు

ఢిల్లీ సరిహద్దులలో జరుగుతోన్న రైతుల ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న నిరసనలకు సామాన్యులే కాదు, సెలెబ్రిటీలు కూడా మద్దతు ఇస్తున్నారు.

Shubman Gills family: రైతుల ఉద్యమానికి శుబమన్‌ గిల్‌ కుటుంబసభ్యుల మద్దతు

Updated on: Dec 03, 2020 | 4:17 PM

ఢిల్లీ సరిహద్దులలో జరుగుతోన్న రైతుల ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న నిరసనలకు సామాన్యులే కాదు, సెలెబ్రిటీలు కూడా మద్దతు ఇస్తున్నారు.. తాజాగా టీమిండియా క్రికెటర్‌ శుబమన్‌ గిల్‌ కుటుంబం కూడా రైతుల ఉద్యమానికి మద్దతు పలికింది.. శుబమన్‌ గిల్‌ తండ్రి లఖ్వీందర్‌సింగ్‌ కూడా రైతే! నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు తమ కుటుంబం పూర్తి మద్దతు ఇస్తుందని లఖ్వీందర్‌ చెప్పారు. తన తండ్రి రైతుల ఉద్యమంలో పాలుపంచుకుంటానంటూ ఇంట్లోంచి బయలుదేరారని, అయితే ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వద్దని చెప్పామని లఖ్వీందర్‌ అన్నారు. తామంతా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవారమేనని, గిల్‌కు కూడా చిన్నప్పట్నుంచి వ్యవసాయంపై ఎంతో ఇష్టం చూపించేవారని, తాతలు, మామల దగ్గర్నుంచి వ్యవసాయం నేర్చుకున్నాడని లఖ్వీందర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న శుబమన్‌ గిల్‌కు కూడా తాను పుట్టి పెరిగిన ఊరంటే ఎంతో మమకారం. తన క్రికెట్‌ ప్రాక్టీసంతా పంట పొలాల్లోనే సాగింది. గిల్‌ క్రికెటర్‌ కాకపోయి ఉంటే మత్రం కచ్చితంగా రైతు అయ్యేవాడని లఖ్వీందర్‌ తెలిపారు. క్రికెట్‌ నుంచి పూర్తిగా తప్పుకున్నాక ఊళ్లో ఉన్న వ్యవసాయక్షేత్రంలో పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తానని గిల్‌ చాలా సార్లు తనతో చెప్పుకున్నాడని లఖ్వీందర్‌ అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us