‘కార్తికేయ’తో ఏజెంట్ బ్యూటీ..!

'కార్తికేయ'తో ఏజెంట్ బ్యూటీ..!

యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కార్తికేయ 2’. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హిట్ అందుకున్న శృతి శర్మను తీసుకున్నట్లు ఇటివలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఆమె హీరోయిన్‌గా దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తికాగా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కార్తికేయ’ పెద్ద […]

Ravi Kiran

|

Aug 29, 2019 | 2:21 PM

యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కార్తికేయ 2’. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హిట్ అందుకున్న శృతి శర్మను తీసుకున్నట్లు ఇటివలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఆమె హీరోయిన్‌గా దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తికాగా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కార్తికేయ’ పెద్ద సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ‘కార్తికేయ 2’ సినిమాతో… తిరిగి ఫామ్‌లోకి  రావాలని ఇద్దరూ ఆశిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై రూపొందనున్న ఈ చిత్రంలో తారాగణం ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu