అమెరికా క్రికెట్లోకి బాలీవుడ్ బాద్ షా ఎంట్రీ.. భారీ క్రికెట్ లీగ్‌లో పెట్టుబడులు..

బాలీవుడ్ సినీ పరిశ్రమకు, క్రీడా రంగానికి అవినాభావ సంబంధాలు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా క్రికెట్‌ను సినీ స్టార్స్ చాలా..

అమెరికా క్రికెట్లోకి బాలీవుడ్ బాద్ షా ఎంట్రీ.. భారీ క్రికెట్ లీగ్‌లో పెట్టుబడులు..

Updated on: Dec 02, 2020 | 2:54 PM

బాలీవుడ్ సినీ పరిశ్రమకు, క్రీడా రంగానికి అవినాభావ సంబంధాలు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా క్రికెట్‌ను సినీ స్టార్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. క్రీడలపై మక్కువతో సినీ స్టార్లు పెట్టుబడులు పెట్టడంతో పాటు.. ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం, స్పాన్సర్‌షిప్ చేయడం వంటివి ఎన్నో చూశాం. అయితే ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సహ యజమానిగా ఉండటమే కాకుండా.. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టుకు యజమానిగా ఉన్న బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఫోకస్ ఇప్పుడు అమెరికా క్రికెట్‌పై పడింది. ఆ దేశ క్రికెట్ వ్యాపార కార్యకలాపాల్లోకి అడుగు పెట్టాలని బాద్ షా ఫిక్స్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అమెరికాలో త్వరలో ఆరంభం కాబోయే ఓ భారీ క్రికెట్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా క్రికెట్ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థతో షారుక్ చేతులు కలిపాడు. ‘ఆసియా దేశాల తర్వాత క్రికెట్‌ను అమితంగా అభిమానించే వారి సంఖ్య అమెరికాలోనే అధికంగా ఉంది. ఇందులో భాగంగా భవిష్యత్‌లో అమెరికాలో జరిగే క్రికెట్ పోటీల్లో భాగస్వాముడిని అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నైట్ రైడర్స్ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు ఇది దోహద పడుతుంది’ అని షారుక్ తెలిపాడు. ఇదిలాఉండగా కేకేఆర్ యజమానుల్లో ఒకరైన జూహీచావ్లా కూడా ఏస్ సంస్థతో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకొంది.